Trending news

Amaravati Farmers: రాజధాని రైతులకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. 15వ తేదీలోగా ఖాతాల్లోకి సొమ్ము..

[ad_1]

  • అమరావతి రాజధాని ప్రాంత రైతులకు గుడ్‌న్యూస్‌..

  • పెండింగ్ లో ఉన్న కౌలు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్..

  • వచ్చే నెల 15వ తేదీలోగా రైతులకు సంబంధించిన పెండింగ్‌ కౌలు నిధుల విడుదల..

  • మంత్రి నారాయణ ప్రకటన..
Amaravati Farmers: రాజధాని రైతులకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. 15వ తేదీలోగా ఖాతాల్లోకి సొమ్ము..

Amaravati Farmers: అమరావతి రాజధాని ప్రాంత రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని రైతులకు పెండింగ్ లో ఉన్న కౌలు నిధులను విడుదల చేసేందుకు సిద్ధం అవుతుంది.. ఈ విషయాన్ని మంత్రి నారాయణ వెల్లడించారు.. పెండింగ్‌లో ఉన్న కౌలు నిధులను త్వరలోనే విడుదల చేస్తాం అని ప్రకటించారు నారాయణ.. వచ్చే నెల 15వ తేదీలోగా రైతులకు సంబంధించిన పెండింగ్‌ కౌలు నిధులు.. వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు పేర్కొన్నారు.. రైతులకు నిధులు విడుదలకు ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారని.. రైతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి నారాయణ..

Read Also: National Sports Day: క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయి.. ప్రతి ఓటమి గెలుపునకు మెట్టు..

కాగా, మరోవైపు రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.. ఈ రోజు సీఎం చంద్రబాబు సమక్షంలో కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఆర్‌డీఏ) కీలక సమావేశం నిర్వహించనుంది.. ఈ సమావేశంలో రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనుల పునఃప్రారంభంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే, ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి నిర్మాణాల పునః ప్రారంభం ఉంటుందనే ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే..



[ad_2]

Related Articles

Back to top button
Close
Close