Trending news

Amala Paul : హేమ క‌మిటీ రిపోర్టు పై స్పందించిన అమలాపాల్.. మహిళలకు ఛాన్స్ ఇవ్వాలంటూ..

[ad_1]

హేమ క‌మిటీ రిపోర్టు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో భారీ దుమారం రేగుతోంది. హేమ క‌మిటీ రిపోర్టులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. దాంతో అమ్మ సంస్థ పాలకమండలిని రద్దు చేశారు. దీంతో చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించి చాలా మంది తమకు జరిగిన చేదు సంఘటనలు గుర్తు చేసుకున్నారు. తాజాగా హేమ కమిటీ నివేదిక తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని నటి అమలా పాల్ వెల్లడించారు. స్టార్‌ ఆర్గనైజేషన్‌తో సహా మహిళలు సారథ్యం వహించాలని, ప్రతి రంగంలో 50 శాతం మంది మహిళలు ఉండాలని ఆమె అన్నారు. కొచ్చిలో అమల మీడియాతో మాట్లాడారు. డబ్ల్యూసిసి బాగా చేసారు. ఆరోపణలకు చట్టపరమైన న్యాయం జరగాలని అమలా పాల్ అన్నారు.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: ఎంతమందిని దింపుతార్రా బాబు..! బిగ్ బాస్ హౌస్‌లోకి మరో క్రేజీ బ్యూటీ

అదే సమయంలో సినీ పరిశ్రమ నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీంతో పోలీసులు నటులు ఎవల బాబు, సుధీష్‌లపై కేసు నమోదు చేశారు. కోజికోడ్‌కు చెందిన ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అమ్మ సంస్థలో సభ్యత్వం కావాలంటే కాంప్రమైజ్ కావాలని అడిగారని ఎవల బాబుపై ఫిర్యాదు చేశారు. అలాగే నటుడు సుధీష్ దుర్భాషలాడారని ఆరోపణలు వచ్చాయి. దాంతో లైంగిక వేధింపుల కింద సెక్షన్ 364 (ఎ) కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో మరో జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదుతో దర్శకుడు శ్రీకుమార్ మీనన్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. హోటల్‌లో దర్శకుడు తనను వేధించాడని ఆ మహిళ ఆరోపించింది. శ్రీకుమార్ మీనన్‌పై మారడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి : Prasad Behara : అన్నం తింటుంటే బూతులు తిట్టి గెంటేశారు.. ప్రసాద్ బెహరా మాటలకు కన్నీళ్లు ఆగవు

ఓ అడ్వర్టైజ్‌మెంట్ లో ఛాన్స్ ఇస్తానని చెప్పి శ్రీకుమార్ మీనన్ తనను కొచ్చిలోని ఓ హోటల్‌కు పిలిపించి అనుచితంగా ప్రవర్తించాడని జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు చేసింది. అలాగే దర్శకుడు రంజిత్‌పై పోలీసులు మళ్లీ కేసు నమోదు చేశారు. కోజికోడ్‌ కసబా పోలీసులు రంజిత్‌పై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. మంగావ్‌కు చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. గతంలో బెంగాలీ నటి ఫిర్యాదుతో రంజిత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మళ్లీ రంజిత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close