Allu Arjun: 14 ఏళ్ల తర్వాత ఆ దర్శకుడితో అల్లు అర్జున్.. కానీ ఓ ట్విస్ట్ ఉంది

[ad_1]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. నిజానికి పుష్ప సినిమాను కమిట్ అయిన తర్వాత బన్నీ ఫ్యాన్స్ ఆయన సినిమాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. పుష్ప సినిమాకే బన్నీ చాలా ఏళ్లు కేటాయించారు. ఇప్పుడు పుష్ప 2 రెడీ అవుతోంది. అల్లు అర్జున్ పాపులారిటీ కేవలం సౌత్ కే పరిమితం కాదు. ఇండియా వైడ్ గా బన్నీకి అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తారు అన్నదాని పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే దాదాపు 14 ఏళ్ల తర్వాత ఓ దర్శకుడితో అల్లు అర్జున్ కలిసి పని చేయనుండట. ఆ దర్శకుడు ఎవరో కాదు క్రిష్. అయితే అది సినిమా కోసం కాదట. ఓ యాడ్ కోసం బన్నీ, క్రిష్ కలిసి పని చేయనున్నారట. అన్నపూర్ణ స్టూడియోలో అల్లు అర్జున్ ఓ పెద్ద బ్రాండ్‌కు సంబంధించిన యాడ్‌ను చిత్రీకరించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ ఇంతకు ముందు అల్లు అర్జున్ హీరోగా ‘వేదం’ సినిమాయూ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి అల్లు అర్జున్ క్రిష్ చేతులు కలిపారని తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ బ్రాండ్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలు పెడతాడు.? ఏ బ్రాండ్ అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
‘పుష్ప 2: ది రూల్’ విడుదలకు ముందే విశేష ఆదరణ పొందుతోంది. 2024లో ఎక్కువ మంది ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప ఒకటి. ‘పుష్ప 2’ డిసెంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ వంటి పలువురు నటీనటులు కనిపించనున్నారు. అల్లు అర్జున్ పుష్ప రాజ్‌గా మరోసారి సందడి చేయనున్నాడు. ఈ మూవీతో మరోసారి బన్నీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
[ad_2]