Allu Arjun: బన్నీ నెక్ట్స్ మూవీ అదేనా? మరోసారి భారీ పాన్ ఇండియా మూవీ..

[ad_1]
పుష్ప చిత్రంతో ఒక్కసారి నేషనల్ వైడ్‌గా పాపులారిటీని సంపాదించుకున్నారు బన్నీ. పుష్పలో తనదైన అద్భుత నటన, మేనరిజంతో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు. ఏకంగా నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. తగ్గేదేలే అంటూ నేషనల్ వైడ్‌గా ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో బన్నీ తదుపరి చిత్రాలపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు బన్నీకి సంబంధించి వార్తలను నేషనల్ మీడియా సైతం కవర్ చేస్తోంది.
దీంతో సహజంగానే పుష్ప సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ సైతం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. డిసెంబర్ 6వ తేదీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోందీ మూవీ. దీంతో బన్నీ నెక్ట్స్ మూవీ ఏంటా అన్నదానిపై ఇప్పటి నుంచి అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. పుష్పను మించిన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని బన్నీ ఆలోచనిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికరమైన కథనం బయటకు వచ్చింది.
తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు అల్లు అర్జున్ తదుపరి చిత్రానికి స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించనున్నారని సమాచారం. వారం రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదలా ఉంటే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ మంచి ట్రాక్ రికార్డ్ ఉందన్న విషయం తెలిసిందే. జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అట్లీ, షారుఖ్ హీరోగా తెరకెక్కిన జవాన్ చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిదే. దీంతో ప్రస్తుతం బన్నీ, అట్లీ కాంబినేషన్‌లో సినిమా వస్తుందన్న వార్తలు సెన్సేషన్‌గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
[ad_2]