Trending news

All Time IPL XI: ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవ‌న్.. రోహిత్‌కు దక్కని చోటు! కెప్టెన్‌గా..

[ad_1]

  • హ‌ర్షా భోగ్లే ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌
  • కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ
  • రోహిత్‌కు దక్కని చోటు
All Time IPL XI: ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవ‌న్.. రోహిత్‌కు దక్కని చోటు! కెప్టెన్‌గా..

Harsha Bhogle Picks All Time IPL Playing 11: భారతదేశ ప్రముఖ కామెంటేటర్ హ‌ర్షా భోగ్లే త‌న ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ఎంచుకున్నాడు. తన జ‌ట్టుకు కెప్టెన్‌గా టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీని ఎంపిక చేశాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకడైన రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌ ఐదు టైటిల్స్ అందించిన విషయం తెలిసిందే. అంతేకాదు బెస్ట్ ఓపెనర్ కూడా.

హర్ష భోగ్లే తన జట్టు ఓపెనర్లుగా క్రిస్ గేల్, విరాట్ కోహ్లీలను తీసుకున్నాడు. ఈ జోడి బెంగళూరు తరఫున ఓపెన‌ర్లుగా 28 ఇన్నింగ్స్‌లలో 1210 పరుగుల చేశారు. మూడో స్ధానంలో మిస్ట‌ర్ ఐపీఎల్ సురేష్ రైనాకు చోటిచ్చాడు. ఐపీఎల్‌లో 5000 ప‌రుగుల మైలు రాయిని అందుకున్న తొలి క్రికెట‌ర్ రైనానే. ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్‌లను మలుపుతిప్పాడు. నాలుగో స్ధానంలో మిస్టర్ 360 సూర్య‌కుమార్ యాద‌వ్‌కు అవకాశం ఇచ్చాడు. ముంబై తరఫున సూర్య‌ ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌ల‌ను ఆడాడు.

హ‌ర్షా భోగ్లే త‌న జ‌ట్టుకు కెప్టెన్‌తో పాటు వికెట్ కీప‌ర్‌గా ఎంఎస్ ధోనీనే ఎంచుకున్నాడు. ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ల‌లో మహీ ఒకరు. ఆల్‌రౌండ‌ర్‌గా హార్దిక్ పాండ్యాను తీసుకున్నాడు. ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. స్పిన్ కోటాలో రషీద్ ఖాన్, సునీల్ నరైన్‌లకు అవకాశం ఇచ్చాడు. ఈ ఇద్దరు స్పిన్ బౌలింగ్‌తో పాటు మెరుపు బ్యాటింగ్ చేస్తారు. ఫాస్ట్ బౌలర్లుగా లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాకు చోటిచ్చాడు. ఈ ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన బౌలర్లుగా పేరుగాంచారు.

Also Read: Pakistan Players Fight: పొట్టుపొట్టు కొట్టుకున్న పాక్ ప్లేయర్స్.. షాక్‌లో పీసీబీ!

హ‌ర్షా భోగ్లే టీమ్:
విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, సురేశ్ రైనా, సూర్యకుమార్ యాదవ్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, రషీద్ ఖాన్, సునీల్ నరైన్.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close