Trending news

Aditi Rao Hydari Marriage: సిద్ధార్థ్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన అదితిరావు హైదరీ!

[ad_1]

  • సీక్రెట్‌గా అదితి ఎంగేజ్మెంట్‌
  • స్కూల్‌లో సిద్దార్థ్‌ ప్రపోజ్ చేశాడు
  • రంగనాథస్వామి ఆలయంలోనే పెళ్లి
Aditi Rao Hydari Marriage: సిద్ధార్థ్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన అదితిరావు హైదరీ!

Aditi Rao Hydari and Siddharth Marriage Update: గత మార్చిలో హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్ అదితిరావు హైదరీలు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి పాల్గొనగా.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు సిద్ధార్థ్‌తో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రంగనాథస్వామి ఆలయంలోనే తామిద్దరం పెళ్లి చేసుకుంటామని అదితి చెప్పారు.

‘మహాసముద్రం సినిమా షూటింగ్‌ సమయంలోనే సిద్ధార్థ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే క్రమంగా ప్రేమగా మారింది. మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. మాకు హైదరాబాద్‌లో ఓ స్కూల్ ఉంది. నేను చిన్నతనంలో ఎప్పుడు అక్కడే ఉండేదాన్ని. ఆ స్కూల్ అంటే చాలా ఇష్టం. కొన్నాళ్ల క్రితం మా నానమ్మ కన్నుమూశారు. ఓ రోజు సిద్దార్థ్‌ నన్ను ఆ స్కూల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మోకాళ్లపై కూర్చొని నాకు ప్రపోజ్ చేశాడు. సిద్దార్థ్‌ ప్రపోజ్ చేసిన తీరు ఎంతో నచ్చింది. నాన్నమ్మ ఆశీస్సులకోసమే అక్కడ ప్రపోజ్ చేశాడు’ అని అదితిరావు హైదరీ చెప్పారు.

Also Read: Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే!

‘శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అందుకే అక్కడే సిద్ధార్థ్‌, నేను నిశ్చితార్థం చేసుకున్నాం. పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. పెళ్లి డేట్ ఫిక్స్ అయిన తర్వాత నేను చెబుతాను’ అని అదితిరావు హైదరీ తెలిపారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. బాయ్స్, నువస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి హిట్స్ సిద్ధార్థ్‌ ఖాతాలో ఉన్నాయి. సమ్మోహనం సినిమాతో అదితి తెలుగు ఇండస్ట్రికి పరిచయం అయ్యారు. ప్రస్తుతం ఇద్దరు సినిమాలతో బిజీగా ఉన్నారు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close