Actor Darshan: బెంగళూర్ జైలు నుంచి బళ్లారి జైలుకి దర్శన్ తరలింపు..

[ad_1]
- బెంగళూర్ జైలు నుంచి బళ్లారి జైలుకి దర్శన్ తరలింపు..
-
ఇటీవల జైలులో సిగరేట్ తాగుతున్న ఫోటో వైరల్.. -
వీఐపీ ట్రీట్‌మెంట్‌పై చర్యలు తీసుకుంటున్న సర్కార్..

Actor Darshan: రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్మన్ బెంగళూర్‌లోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అయితే, ఇటీవల జైలు పరిసరాల్లో దర్శన్ సిగరేట్ తాగుతూ వీఐపీ ట్రీట్‌మెంట్ పొందుతున్న ఫోటో వైరల్‌గా మారడం వివాదమైంది. దీంతో పలువురు జైలు అధికారుల్ని సీఎం సిద్ధరామయ్య ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Read Also: NDA: 12 మంది ఏకగ్రీవం.. రాజ్యసభలో మెజారిటీ మార్క్‌కి చేరిన ఎన్డీయే..
ఈ వివాదం నేపథ్యంలో, దర్మన్‌ని పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకి తరలించారు. ఇటీవల వైరల్ అయిన దర్శన్‌కి సంబంధించిన ఫోటోలో ఆయన ఒక చేతిలో సిగరేట్ మరోచేతిలో కాఫీ కప్ పట్టుకుని నవ్వుతూ ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలో గ్యాంగ్‌స్టర్ విల్సన్ గార్డెన్ నాగ, ఇతర ఖైదీలు నాగరాజ్(దర్మన్ మేనేజర్), కుల్లా సీనా ఉన్నారు. వారంతా నవ్వుతూ ఏదో విషయం గురించి చర్చిస్తున్నట్లు కనిపిస్తుంది.
నటి పవిత్ర గౌడతో దర్శన్ రిలేషన్ షిప్‌లో ఉండటంపై ఆయన అభిమాని చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి పవిత్ర గౌడను ఉద్దేశిస్తూ అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు పెట్టడం హత్యకు కారణమైంది. చిత్రదుర్గ నుంచి బెంగళూర్‌కి కిడ్నాప్ చేసి తీసుకువచ్చిన తర్వాత, తీవ్రంగా కొట్టడంతో రేణుకాస్వామి చనిపోయాడు. ఈ కేసులో వీరిద్దరితో సహా మొత్తం 17 మంది జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నారు.
[ad_2]
Source link