Trending news

Aadhaar card: మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!

[ad_1]

బ్యాంక్‌ ఎకౌంట్‌ ఓపెన్‌ చెయ్యాలన్నా, సిమ్‌ కార్డ్ కొనాలన్నా, ప్రభుత్వ పథకాలు, ఇంకా ఇతర ఎలాంటి సేవలు పొందాలన్నా ఆధార్‌ కంపల్సరీ. ఇందులో మన వ్యక్తిగత వివరాలతో పాటు బయోమెట్రిక్‌ వివరాలూ నిక్షిప్తమై ఉంటాయి. అలాంటి ముఖ్యమైన ఆధార్‌ కార్డును చాలా మంది ఎక్కడ పడితే అక్కడ వాడేస్తుంటారు. దీనివల్ల ఆధార్‌ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా చూసుకోవడం చాలా అవసరం. మరి మీ ఆధార్‌ ఎక్కడైనా దుర్వినియోగం అయ్యిందా? అయ్యుంటే ఫిర్యాదు చేయడం ఎలా? దుర్వినియోగం కాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి?

ముందుగా ఆధార్‌ను ఎక్కడెక్కడ వినియోగించామో తెలుసుకోవడం ముఖ్యం. దీని కోసం ఉడాయ్‌ పోర్టల్‌కు వెళ్లాలి. అందులో పైన ఎడమ వైపు ఉన్న మై ఆధార్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో ఆధార్‌ సర్వీసెస్‌పైన క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత కిందకు స్క్రోల్‌ చేసి ఆధార్‌ అథెంటికేషన్‌ హిస్టరీ (Aadhaar Authentication History) అనే ఆప్షన్‌ను ఎంచుకోగానే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో లాగిన్‌పై క్లిక్‌ చేసి ఆధార్‌ నంబర్‌, క్యాప్చా, ఓటీపీ ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. తర్వాత కనిపించే స్క్రీన్‌లో కిందకు స్క్రోల్ చేయగానే అథెంటికేషన్‌ హిస్టరీ (Authentication History) అని కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి. అక్కడ ఆల్‌ (ALL)ని ఎంచుకొని డేట్‌ని సెలెక్ట్‌ చేసుకొని Fetch Authentication History పై క్లిక్‌ చేయాలి. ఆధార్‌కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్‌, డెమోగ్రాఫిక్‌ ద్వారా మీ ఆధార్‌ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే డేటా కనిపిస్తుంది.

ఇందులో మీకు తెలియకుండా ఆధార్‌ను ఎక్కడైనా వినియోగించారని అనిపిస్తే వెంటనే 1947కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు. help@uidai.gov.inకి మెయిల్‌ చేయొచ్చు లేదా ఉడాయ్‌ వెబ్‌సైట్‌లో నేరుగా కంప్లెయింట్‌ చేయొచ్చు. ఆధార్‌ని మీకు తెలియకుండా వినియోగిస్తున్నారంటే మీ వేలిముద్రలు వారి చేతికి చిక్కాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపై ఈ ఘటనలు జరగకుండా ఉండాలంటే మీ ఆధార్‌ కార్డ్‌ను బయోమెట్రిక్‌ లాక్‌ చేయడం ఉత్తమం. దీంతో మీ ప్రమేయం లేకుండా బయోమెట్రిక్‌ని వినియోగించడానికి వీలుండదు. దాన్ని కూడా సులువుగా ఆన్‌లైన్‌లో చేయొచ్చు. ఎలా అంటే..

బయోమెట్రిక్‌ లాక్ కోసం మై ఆధార్‌ పోర్టల్‌లో ఆధార్‌ నంబర్‌, ఓటీపీ ద్వారా లాగిన్‌ అవ్వాలి. స్క్రీన్‌పై Lock/Unlock Biometric ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో లాక్‌/అన్‌లాక్‌ ఎలా ఉపయోగపడుతుందనే వివరణ ఉంటుంది. ఆ పేజీలో కనిపించే Next ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై బయోమెట్రిక్‌ లాక్‌/అన్‌లాక్‌కు సంబంధించి రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో Lock Aadhaarని ఎంచుకోవాలి. తర్వాత వర్చువల్‌ ఐడీ, పూర్తిపేరు, పిన్‌కోడ్‌, క్యాప్చా, మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి Send otp పై క్లిక్‌ చేయాలి. మీ రిజిస్టర్ట్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేసి Submit పై క్లిక్‌ చేయాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close