సామ్ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన శ్రీలీల.. ఇక థియేటర్లు దద్దరిల్లేనా ??

[ad_1]
స్టార్ డైరక్టర్, నేషనల్ ఫేమ్ ఉన్న హీరో.. అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్… ఇలాంటి సినిమాలో ఛాన్స్ రావడమే సూపర్ న్యూస్ అని ఎవరైనా ఎగిరి గంతేస్తారు. శ్రీలీల ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇలాంటి సిట్చువేషన్లోనే ఉన్నారు. అయితే ఏదో స్ట్రెస్ ఫీలవుతున్నారు… ఎందుకు?
ఊ అంటావా మావా ఉఊ అంటావా అంటూ సమంత.. అల్లు అర్జున్ కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లాయి. సినిమా ప్రీ రిలీజ్ టైమ్‌లో అయితే సినిమా మీద భారీ అంచనాలను పెంచేశాయి. రిలీజ్ అయ్యీ కాగానే అంతగా క్రేజ్ తెచ్చుకున్న సాంగ్ అది.
ఫస్ట్ పార్టుకు అంతగా ప్లస్ అయిన స్పెషల్ సాంగ్.. ఇప్పుడు సెకండ్ పార్టులో ఎలా ఉండబోతుందన్నది అందరినీ ఊరిస్తున్న విషయం. ట్యూన్, లిరిక్స్ విషయాలను పక్కనపెడితే.. ఇప్పుడు ఆడిపాడబోయే నాయిక విషయం మాత్రం హాట్ టాపిక్కే.
పుష్ప ది రూల్‌లో స్పెషల్ సాంగ్‌లో చేస్తున్నారు శ్రీలీల. ఫస్ట్ పార్టులో చేసిన సమంతను బీట్ చేసి.. జనాలతో ఈ లేడీ ఊ అనిపించుకోగలరా? అన్నదే ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్.
నిజానికి శ్రీలీలను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆమె కెరీర్ స్టార్టింగ్‌లోనే దుమ్మురేపే సాంగులకు స్టెప్పులేశారు.
శ్రీలీల డ్యాన్స్ టాలెంట్ గురించి మహేష్ లాంటి హీరో ఓపెన్‌గా పొగిడేశారు. బన్నీ కూడా స్టెప్పులకు సెలబ్రిటీల్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో… బన్నీ, శ్రీలీల కలిసి వేసే నాటు స్టెప్పులు.. ఊ అంటావా.. సాంగ్‌ని మించేస్తాయన్నది యూనిట్ నుంచి వినిపిస్తున్న స్ట్రాంగ్ న్యూస్.
[ad_2]