Trending news

శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన వరుడు.. చివరకు ??

[ad_1]

ఎన్నో ఆశలు.. ఎన్నో ఆకాంక్షలతో పెళ్లి చేసుకున్నారు.. 15 రోజుల క్రితం పెద్దల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది.. దీంతో నవ వధూవరులిద్దరూ శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. ఇద్దరూ కలిసి స్వామి వారిని దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో కాలినడకన బయలుదేరారు.. ఇంతలోనే తీవ్ర విషాదం జరిగింది.. శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. అలిపిరి మెట్లదారిలో వెళుతుండగా గుండెపోటుతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. నవీన్‌ అనే వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.. 15 రోజుల క్రితం ఆయనకు వివాహమైంది. ఈ క్రమంలో నవీన్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చాడు. అక్కడి నుంచి కాలినడకన అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు బయలుదేరారు. ఈ క్రమంలోనే.. 2,350వ మెట్టు దగ్గరకు రాగానే నవీన్‌ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైబ్రిడ్‌ రాకెట్స్‌ వచ్చేశాయి.. వీటి స్పెషాల్టీ ఏమిటంటే ??

Explainer: హైదరాబాద్‌లో అంత మంది గురకపెడుతున్నారా ??

[ad_2]

Related Articles

Back to top button
Close
Close