వాట్సాప్ లో మీరు ఊహించని కొత్త ఫీచర్స్ ఇవే చూస్తే షాక్ అవుతారు
WhatsApp will be shocked if you see unexpected new features in WhatsApp

మీరు వాట్సప్ వినియోగదారులా? అందులో స్టిక్కర్ ఫిచర్ బాగా వాడతారా? అయితే మీకు ఇది గుడ్ న్యూస్. వాట్సప్‌లో త్వరలో యానిమేటెడ్ స్టిక్కర్స్ ను తీసుకురానున్నారు. వాట్సప్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచానికి వెల్లడించే Wabetainfo ప్రకారం ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వర్షన్లలో యానిమేటెడ్ స్టిక్కర్ ఫీచర్‌ని వాట్సప్ టెస్ట్ చేస్తోంది.
అయితే ఆండ్రాయిడ్ 2.20.1 94./, ఐఓఎస్ 2.20.70.26 వర్షన్ అప్డేట్ చేయాలి. మీకు వాట్సప్ యానిమేటెడ్ స్టిక్కర్స్ కనిపిస్తాయి. మీరు యానిమేటెడ్ స్టిక్కర్స్ ను సేవ్ చేయొచ్చు. ఇతరులకు సెండ్ చేయవచ్చు. అంతేకాదు… ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యానిమేటెడ్ స్టిక్కర్స్‌ని ఇంపోర్ట్ సైతం చేసుకోవచ్చు. ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే ఉన్న యానిమేటెడ్ స్టిక్కర్ ఫీచర్ త్వరలో ఇతర యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.
వాట్సప్ నుంచి మరో ఫీచర్ సైతం రాబోతోంది. డార్క్ మోడ్ ఉపయోగిస్తున్నవారికి ఛాట్ విండోలో కొన్ని మార్పులు చేయనుంది. ఛాట్ బబుల్ కలర్‌ని మార్చబోతోంది. కొత్త కలర్ ద్వారా యూజర్లకు ఛాటింగ్ సమయంలో ఇంకా సౌకర్యవంతంగా ఉండేందుకు కొత్త కలర్‌ని పరిచయం చేయనుంది వాట్సప్. ఈ మార్పులు కేవలం డార్క్ మోడ్‌కు మాత్రమే. మీరు లైట్ మోడ్‌లోకి వెళ్త ఛాట్ బబుల్ ఇప్పుడు ఉన్న కలర్లోనే ఉంటుంది. మీరు మ వాట్సప్ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే ఈ కొత్త ఫీచర్స్ ను ఎంజాయ్ చేయవచ్చు.