వంద రూపాయలకి 12 రకాల కూరగాయలు
12 varieties of vegetables for one hundred rupees

కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లొ నిత్యావసర వస్తువులు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తమిళనాడులోని కొయ్యంబత్తూరు మున్సిపల్ కార్పొరేషన పరిధిలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటికి రూ.100 కూరగాయల ప్యాకెజిని అందిస్తున్నారు. ఇందులో 12 రకాల కూరగాయలు ఉంటాయి. కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రజలకు కూరగాయల ప్యాకేజీని అందిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్పి వేలుమణి ప్రారంభించారు. 25 కార్పొరేషన వ్యాన్ల ద్వారా
ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. ఈసందర్భంగా మంత్రి వేలుమణి మాట్లాడారు. ప్రజల క్షేమం కోసమే ఈ ప్యాకేజిని ప్రారంభించామన్నారు. ఈ ప్యాకేజి ప్రారంభమైన తర్వాత కొయ్యంబత్తూరు మార్కెట్ లో రద్ది తగ్గింది. ఇదే విధానాన్ని దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో అమలు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.