లాక్ డౌన్ ముగిశాకా పెట్టుబడులకు కేంద్రం గా మారనున్న భారత్
India will become a hub for investment after the lockdown is over

ప్రస్తుతం కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమవుతోంది. 210 దేశాల్ల్ విస్తరించిన కోవిడ్- 19 మహమ్మారి లక్ష 91
వేలమందికి పైగా బలితీసుకుంది. 2/7 లక్షలమందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారిని నియంత్రించడానికి చాలాదేశాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. దింతో తీవ్ర ఆర్ధిక సంక్ష భం తప్పదని ప్రపంచ వాణిజ్య సంస్థ పేర్కొంది. అమెరికా, యూరప్ దేశాల్తొ కరోనో సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. యూరప్ దేశాల ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. మిగతా దేశాలతో పోలిస్తే, భారత్ లో కరోనా నియంత్రణలోనే ఉంది. కరోనాను కట్టడి చేయడానికి ప్రధాని మోదీ లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
రిలయన్స్ జియోలో ఫెస్ బుక్ పెట్టుబడులు పెట్టడం యావత్ ప్రపంచం దృ్యని ఆకర్షించింది. పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలన్నీ భారత్ వైపు చూస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం. అమెరికా కరోనాతో విలవిలలాడడం, యూరప్ ఆర్ధిక వ్యవస్థ పతనమవడంతో పాటు కరోనా విషయంలో వైనా వైఖరి తీవ్ర అనుమానాస్పదంగా ఉండి ఇతర దేశాల నమ్మకాన్నిBకోల్పోవడం ప్రపంచ దేశాలను భారత్ వైపు చూసేలా చేసంది.
మరోవైపు, ఈ సంక్షోభ సమయంలో ప్రపంచదేశాలకు అండగాB నిలవడం, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతి తదితర కారణాల వల్ల విదేశీ నాయకులకు, సంస్థలకు భారత్ ఫై అభిమానం మరింత పెరిగింది. అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, శ్రీలంక, ఇజ్రాయెల్ తో పాటుగా వివిధ దేశాల అధినేతలు ప్రధాని మోదికి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వీటితో పాటుగా, ప్రస్తుతం భారత ఆర్ధిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతొంది.
దిగ్గజ సంస్థలన్నీ భారత ఆర్టిక వ్యవస్థ పురోగమనానికి తమవంతు సహకారం అందిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ భారత్ వాటన్నింటినీ సులువుగా అథిగమిస్తుందని అందరూ అభివ్రాయపడుతున్నారు. ప్రభుత్వం బెత్సాహికులైన యువ ఎంటర్ ప్రైెన్యూవర్స్ ను ప్రోత్సహించడానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలో కోవిడ్- 19 తరువాత పెట్టుబడులకు కేంద్ర బిందువుగా భారత్ మారనుందని దిగ్గజాలైన పారిశ్రామికవేత్తలు, ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్పత్తి రంగానికి మరింత ఊతం లభించనుందని పర్కొంటున్నారు. రిలయన్స్- ఫేస్ బుక్ డీల్ పై ఆనంద్ మహింద్రా హర్షం వ్యక్తం చేశారు.
మున్ముందు పెట్టుబడులకు భారత్ స్వర్గధామంగా మారనుందని అభిప్రాయపడ్డారు. దేశంలోని యువత వినూత్న ఆలోచనలతో ముందు రావాలని, భారత్ ను ఆర్ధికంగా మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఆలోచనా పరిధిని పెంచులోవాలని ఆర్ధికవేత్తలు సూచిస్తున్నారు. ఏ దేశంలోనూ లేని అద్భుతమైన యువశక్తి భారత్ సొంతమని, వారికి భారత ఆర్టిక వ్యవస్థను అగ్రస్థానానికి తీసుకెళ్లే సత్తా ఉందని నిపుణులు అభివ్రాయపజ్డారు.