లాక్ డౌన్ కారణంగా రిలయన్స్ జియో ప్రకటించిన ఫ్రీ ప్లాన్స్ ఇవే
These are the free plans announced by Reliance Jio due to the lockdown

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటం, జనమంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వారి కొసం రిలయన్స్ జియో ప్రత్యేకమైన రిఛార్ట్ ఆఫర్స్, బెనిఫిట్స్ అందిస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జియో ఫోన్ ఉన్నవారందరికీ 100 నిమిషాల కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లను కాంప్లిమెంటరీగా అందిస్తోంది. 2020 ఎప్రిల్ 17వ తేది వరకు ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి. అంతేకాదు జియో ఫోన్‌లో వ్యాలిడిటి పూరైన తర్వాత కూడా ఇన్‌కమింగ్ కాల్స్ వస్తాయి. రిలయన్స్ జియో 5 కొత్త ప్లాన్స్ కూడా ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి రూ.251 ప్లాన్ అందిస్తోంది. రిలయెన్స్ జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ రీఛార్ట్ చేసుకున్నవారికి 51 రోజుల వేలిడిటీ లభిస్తుంది.
రోజుకు 2 బీబీ డేటా వాడుకోవచ్చు. ఈ ప్లాన కేవలం ఇంటర్నెట్ బెనిఫిట్స్ కొసమే. కాబట్టి ప్రత్యేకంగా కాల్స్, ఎస్‌ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఏవీ ఉండవు. 4జీ డేటా ఎక్స్‌టెన్షన్ ప్లాన్స్ కూడా ప్రకటించింది. డేటా వోచర్లపై నాన్ జియో కాల్ టైమ్‌తో పాటు డబుల్ డేటాను అందిస్తోంది. 4జీ డేటాను అందించే రూ.11, రూ. 21, రూ.51, రూ.101 ఓచర్లపై ఈ అదనపు బెనిఫిట్స్ పొందొచ్చు. రూ.1 1 డేటా ఓచర్ రిఛార్ట్ చేస్తె గతంలో 400 ఎంబి డేటా వచ్చేది. ఇప్పుడు 800 ఎంబీ డేటా వాడుకోవచ్చు. 75 నిమిషాలు నాన్ జియో కాల్స్ చేసుకోవచ్చు. రూ.21 డేటా ఓచర్ రీఛార్ట్ చేస్తే గతంలో 1 బీబీ డేటా వచ్చేది. ఇప్పుడు 2బీబీ డేటా వాడుకోవచ్చు. 200 నిమిషాలు నాన్ జియో కాల్స్ చేసుకోవచ్చు.
రూ.51 డేటా ఓచర్ రిఛార్ట్ చేస్తే గతంలో వ౨బీబీ డేటా వచ్చేది. ఇప్పుడు 6జీబీ డేటా వాడుకోవచ్చు. 500 నిమిషాలు నాన్ జియో కాల్స్ చేసుకోవచ్చు. రూ.101 డేటా ఓచర్ రీఛార్ట్ చేస్తే గతంలో 6జీబీ డేటా వచ్చేది. ఇప్పుడు 12బీబీ డేటా వాడుకోవచ్చు. 1000 నిమిషాలు నాన్ జియో కాల్స్ చేసుకోవచ్చు. బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది రిలయెన్స్ జియో. 10 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఉచితంగా ఇస్తామని రిలయెన్స్ జియోఫైబర్ ప్రకటించింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో రిలయెన్స్ జియోఫైబర్ ఈ ఆఫర్ అందిస్తోంది. భారతదేశంలో లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు ఈ కొత్త ప్లాన్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఆ తర్వాత సబ్‌స్కైబర్లు ఉచిత ప్లాన్ నుంచి ప్రస్తుతం ఉన్న ఇతర ప్లాన్స్‌లోకి మారొచ్చు.మీరు ఉచితంగా జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ 10ఎంబీపీఎస్ ప్లాన్ పొందాలనుకుంటే జియో వెబ్‌సైట్ లేదా మైజియో యాప్‌లో రిజిస్టషన్ చేసుకోవాల్సి ఉంటుంది.