రోజుకు 28 రూపాయలతో నాలుగు లక్షల వరకు డబ్బులు పొందే చాన్స్
Chance of getting up to four lakhs of rupees with 28 rupees a day

ఎల్‌ఐసి ప్రజలకు ఎన్నో రకాల పాలసిలను అందిస్తోంది. మనీబ్యాంక్, చిల్రన్స్ పాలసీ, టర్మ్ పాలసీ, ఎండోమెంట్ ప్లాన్స్, రిటైర్మెంట్ పాలసీలు ఇలా చాలా రకాల ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ చేసంది. ఆధార్ స్తంభ్ పాలసీ కూడా ఇందులో ఒకటి. ఎల్‌ఐసీ ఆధార్ స్తంభ్ పాలసీ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. ఇది లో ప్రమియం ప్లాన్. రోజుకు రూ.28 ఆదా చేసుకొని ఈ పాలసీతో ఇన్వెస్ట్ చేస్తే మీరు దాదాపు రూ.4 లక్షలు పొందొచ్చు. ఐదేళ్ల తర్వాత లాయల్టీ అడిషన్స్ కూడా లభిస్తాయి. 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న వారు ఈ పాలసి తీసుకోవచ్చు.
ఈ ఎల్‌ఐసీ పాలసీని కనీసం రూ.75,000 బీమా మొత్తానికి తీసుకోవాలి. గరిష్టంగా రూ.3,00,000 మొత్తం వరకు
తీసుకోవచ్చు. ఈ పాలసి తీసుకోవడం వల్ల డెత్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. పాలసి తీసుకున్న వ్యక్తి తొలి ఐదేళ్లలోనే మరణిస్తే అప్పుడు పాలసీ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. అదే పాలసిదారుడు ఐదేళ్ల తర్వాత మరిణిస్తే అప్పుడు నామినీకి బీమా మొత్తంతోపాటు లాయళట్టీ అడిషన్స్ కూడా అందిస్తారు. పాలసి గడువులో ప్రమియం రూపంలో మీరు దాదాపు రూ.2 లక్షలు చెల్లిస్తారు. మీకు మెచ్యూరిటి సమయంలో రూ.3 లక్షల బీమా మొత్తం అందిస్తారు. లాయ అడిషన్ రూ.97,500. అంటే మీకు మొత్తంగా చేతికి దాదాపు రూ.4 లక్షలు వస్తాయి. 8 ఎళ్ల చిన్న పిల్లల పేరుపై ఈ పాలసీ తీసుకుంటే చాలా మంచిది.