మీ సొంత ఊరిలోనే స్వయం ఉపాధి హామీ ని పొందండి ఈ చిన్న ఆధార్ కార్డు పనులు చేసి
Get self-employment guarantee in your hometown by doing these small Aadhaar card works

తక్కువ పెట్టుబడితోనే ఏదో ఒక వ్యాపారం చేసి స్వయం ఉపాధి పొందాలని చాలా మంది భావిస్తారు. అలాంటి వారికోసమే Lokal యాప్ ఈరోజు ఒక చక్కటి, తక్కువ పెట్టుబడితో చేయగలిగే స్వయం ఉపాధి మార్గాన్ని తీసుకువచ్చింది. సొంతఊరిలోనే స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి ఇది చక్కటి అవకాశం. అదే ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్ అవకాశం. కొత్త ఆధార్ తీసుకోవాలన్నా, ఇప్పుడు ఉన్న ఆధార్‌లోనే ఏవైనా మార్పులు చేయాలన్నా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాల్సిందే. UIDAI నియమనిబంధనలకు అనుగుణంగా ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లు నడుచుకుంటాయి. ఈ ఎన్‌రోల్‌మెంట్ ఏజెన్సీలను రిజిస్ట్రార్లు నియమిస్తారు. పౌరుల బయోమెట్రిక్, డెమొగ్రఫిక్ డేటా సేకరిస్తుంటాయి. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లు ఉన్నాయి.
ఆధార్ కార్డు ఫ్రాంచైజ్ పొంది, ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే ముందుగా మీరు UIDAI నిర్వహించే సూపర్‌వైజర్ లేదా ఆపరేటర్ సర్టిఫికేషన్ ఆన్‌లైన్ ఎగ్జామ్ పాస్ కావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష పాసైన తర్వాత మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, ఆధార్ బయోమెట్రిక్స్ వెరిఫికేషన్ చేయడానికి ఆథరైజేషన్ లభిస్తుంది. ఆ తర్వాత మీరు ప్రభుత్వ గుర్తింపు పొందిన కామన్ సర్వీస్ సెంటర్-CSC రిజిస్ట్రేషన్ పొందాలి. CSC రిజిస్ట్రేషన్ కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
CSC అధికారిక వెబ్‌సైట్ www.csc.gov.in/ ఓపెన్ చేసిన తర్వాత ‘Interested to become a CSC’ లింక్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. CSC రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత ఆధార్ ఫ్రాంఛైజ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్ ఏర్పాటు చేయడానికి ఆఫీస్ గది కావాలి. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్, వెబ్‌క్యామ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐరిస్ స్కానర్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్, పవర్ స్టాండ్‌బై ఉండాలి. ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్ నిర్వహించేవారికి ఒక ఆధార్ కార్డుపై రూ.35 ఆదాయం లభిస్తుంది.