మీరు రోజు నీరు తక్కువగా తాగుతున్నారా అయితే చాలా డేంజర్ ఎందుకో తెలుసుకోండి
If you drink less water during the day, find out why it is too dangerous

ఉదయం లేచిన దగ్గర నుంచి నీళ్లు ఎనిమిది గ్లాసులు తప్పనిసరిగా తాగాలని చాలా మంది చెబుతుంటారు. తక్కువగా
నీళ్లు తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అజీర్ణం, మలబద్దకం, తలనొప్పి, కిద్నిల్లో రాళ్లు వంటి రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నీళ్లు శరిరానికి కావాల్సిన స్థాయిలో అందించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. కానీ నీటిని ఏ సమయంలో ఎలా తాగాలి. ఎంత పరిమాణంలో తాగాలి అనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగవచ్చా.. లేదా అన్నది అందరినీ వేధించే సమస్య. ఎనిమిది కంటే ఎక్కువ గ్లాసుల నీళ్లు తాగితే ఏమవుతుంది.. ఇలాంటి రకరకాల సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలాంటి అనారోగ్య సమస్యకైనా దివ్యౌషధం నీళ్లు. శరిరంలో జరిగే మెటబాలిక్ చర్యలకు నీళ్లు చాలా ముఖ్యం. నీళ్లు, నీటి శాతం ఎక్కువగా ఉన్నడ్రింగ్స్ తాగటం వల్ల ఎన్నో వ్యాధులు దరి చేరకుండా కాపాడుతాయి. శరిరంలో బ్లడ్ కి ఎంత ప్రాధాన్యత ఉందో.. నీటికి అదే స్థాయిలొ విలువ ఉంది. మనిషికి రోజుకు రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్లు అవసరమౌతాయి. మనిషి బరువుని బట్ట కూడా తాగే నీటి పరిమాణం పెంచాల్సి ఉంటుంది.
భోజనంచేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగాలా లేదా అన్న దానిపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. కానీ.. భోజనం మధ్యలో నీళ్లు తాగాల్సిందే. ఎందుకంటే జీర్ణ సమస్యలు తొలగొపోయి, జీవక్రియ సాఫిగా జరుగడానికి సహకరిస్తాయి.
భోజనానికి ముదు నీళ్లు తాగకూడదు. భోజనానికి ముందు నీళ్లు తాగితే బీర్దక్రియపై ప్రభావం చూపుతుంది. అలాగే భోజనం తర్వాత కూడా కడుపునిండా నీళ్లు తాగకూడదు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల.. ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల శరిరంలోనివ్యర్థాలు దూరమవుతాయి. ఎక్కువగా నీళ్లు తాగితే మూత్రపిండాలపై భారం పడుతుంది. కాబట్టి రోజుకి పది గ్లాసుల కంటే ఎక్కువ నీళ్లు తాగరాదు. ఒక్కసారిగా ఎక్కువ పరిమాణంలో తాగడం కంటే.. అప్పుడప్పుడు కొన్ని కొన్ని తాగితే మంచిది.
ఆకలిని చంపేయగల శక్తి నీటికి ఉంది. నీళ్లు బాగా తాగితే భోజనం తక్కువగా తింటారు. ఫలితంగా బరరువు పెరిగే అవకాశం లేదు. ప్రతిరోజూ ఉదయం రెండు గ్లాసులు, రాత్రి పడుకునే ముందు మూడు నాలుగు గ్లాసుల నీళ్లు తాగాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలంటే శరిరంలో నీటి శాతం సక్రమంగా ఉండాలి. చర్మంపై ముడతలు, చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే.. మంచినీళ్లు బాగా తాగాలి. శరిరంలో తగిన మోతాదులో నీరు ఉంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.రక్త పోటును తగ్గించే శక్తి నీటికి ఉంది. దాహం అనిపించే వరకు నీళ్లు తాగకుండా ఉండకూడదు. దాహంగా అనిపిస్తోంది అంటే.. శరిరంలో నీటిశాతం తగ్గిపోయిందని గుర్తించాలి. తలనొబ్బ, అలసటగా
అనిపిస్త.. ఎక్కువ నీళ్లు తాగాలి.