Top newsTrending newsViral news

మీరు ప్రతిరోజు ఇవి తినండి వ్యాధి నిరోధక శక్తి ఆటోమేటిగ్గా పెరుగుతుంది

If you eat them every day, the immunity will increase automatically

శరీరంలో విటమిన్‌ సి అనేది సమృద్దిగా ఉంటే అది శరీర బరువును బ్యాలెన్స్‌ చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వేరే దారిలేక జంక్‌ ఫుడ్‌ తింటున్నవారికీ, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చెయ్యలేకపోతున్నవారికీ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మనం తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలూ ఉండాలి. విటమిన్లూ, మినరల్స్‌ కలిగి ఉండాలి. మీకు తరచుగా అలసట వస్తున్నా, మాటిమాటికీ మూడ్‌ మారిపోతున్నా, కండరాల్లో నొప్పులు వస్తున్నా, జుట్టు, స్కిన్‌ ఎండిపోతున్నా మీకు సి విటమిన్‌ తగ్గిపోతున్నట్లు లెక్క. మన శరీరానికి విటమిన్‌ సి రెగ్యులర్‌గా అవసరం. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాదు శరిర కణాలు పాడవకుండా చేస్తుంది. మరి తరచూ ఈ పండ్లు తింటే విటమిన్‌
సీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయ : మార్కెట్లలో ఏడాది మొత్తం దొరికే వాటిల్లో నిమ్మకాయలు ఒకటి. వీటిలో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది.తరచుగా నిమ్మరసంలో చక్కర, ఉప్పు కలిగి తాగితే మీ జీర వ్యవస్థ బాగుంటుంది. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

ఉసిరికాయ : ఉసిరి కాయల్లో విటమిన్‌ స్త ఎక్కువగా ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయలు తిన్నా, వాటి రసం తాగినా బాడిలో చెడు బ్యాక్టరియా చచ్చిపోతుంది. వైరల్‌ ఇన్ఫెక్షన్ల వంటివి రావు. దగ్గు, జలుబు కూడా పరారవుతాయి. అందువల్ల వీలు దొరికినప్పుడల్లా ఉసరి కాయలు తినడం మంచిది.

చెర్రిస్‌ : ఎరుపు రంగులో మెరిసిపోయే చెర్రి పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్‌ సీ చాలా ఎక్కువగా ఉంటుంది. రోజూ వీటిని తింటే విటమిన్‌ సీ బాడీకి ఎక్కువగా అందుతుంది. బాడీలో వేడి పెరిగితే, విటమిన్‌ సీ బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల దిన్ని మనం రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close