మీరు కోటీశ్వరులు కావాలంటే ఈ చిట్కాలు పాటించండి చాలు ఈజీగా అయిపోతారు సూపర్ టెక్నిక్స్
If you are a billionaire, follow these tips to keep things simple

కాకబ్ అనేది జపానకు చెందిన ఫైనాన్సియల్ మేనేజమెంట టెక్నిక్. ఇది డబ్బుల్ని ఎలా మేనేజ్ చేయాలన్న అంశాన్ని నేర్పిస్తుంది. డబ్బు పొదుపు చేయడానికి ఈ టెక్నిక్ మీకు బాగా ఉపయోగపడుతుంది. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టేవారు ఈ టెక్నిక్‌ను అర్ధం చేసుకొని అమలు చేస్తే ఖర్చులు తగ్గించుకోవచ్చు. పొదుపు పెంచుకోవచ్చు. కాకీబో అంటే ఇంటి జమాఖర్చుల్ని రాసే పుస్తకం. 1904 సంవత్సరంలో హని మొటోకో అనే మహిళ కాకీబో టెక్నిక్‌ను పరిచయం చేశారు. ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవడానికి 116 ఏళ్ల నాటి ఈ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాకీబో టెక్నిక్ కోసం ఎలాంటి టెక్నాలజీ అవసరం లేదు. కేవలం ఓ పుస్తకం, పెన్ ఉంటే చాలు. మీరు నాలుగు ప్రశ్నలు వేయాలి. మీ ఆదాయం ఎంత? దాంట్లొ ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు చేస్తున్నారు? ఆర్ధిక పర్యితిని ఎలా మెరుగుపర్చుకోవాలి? అని లెక్కలు రాయాలి. మీ ఆదాయానికి మించి ఖర్చులు ఉన్నట్టతె మీరు అతిగా ఖర్చు చేస్తున్నట్టు. ఆ అలవాటు మిమ్మల్నీ అప్పులపాలు చేయొచ్చు.
ఏదైనా ఓ వస్తువు కొనాలనుకునే ముందు ఈ ప్రశ్నలు మీకు మీరే వేసుకోవాలి. ఈ వస్తువు లేకుండా నేను జీవించగలనా? నా ఆర్ధిక పరిస్థితులను బట్టి ఈ వస్తువు కొనగలిగే స్తోమత నాకు ఉందా? నేను ఈ వస్తువును ఉపయోగిస్తానా? ఈ వస్తువు దాచుకోవడానికి ఇంట్లో స్థలం ఉందా? ఆ వస్తువును నేను మొదటిసారి ఎక్కడ చూశాను? ఈ రోజు నా మానసిక స్థితి ఎలా ఉంది? ఈ వస్తువు కొన్న తర్వాత నేను ఎలా ఉంటాను? అనే ప్రశ్నల్ని గుర్తుంచుకోవాలి. ఇందులో మొదటి 4 ప్రన్నలకే మీకు సరైన సమాధానం దొరుకుతుంది. మొదటి నాలుగు ప్రశ్నల్లో మీకు ఈ వస్తువు అవసరం లేదు అనిపిస్తే కొనొద్దు. ఇలా మీ ఖర్చుల్ని కంట్రోల్ చేయడానికి ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుంది.