Top newsTrending newsViral news

మీకు చెమటలు ఎక్కువగా వస్తాయా అయితే అలర్ట్… జాగ్రత్తలు ఇవే లేదంటే ప్రమాదం

Alert if you sweat a lot ... Precautions or risk

శరీరానికి చెమట పట్టడం మంచిదే. మన ఒంట్లోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి, శరీరంలో అధిక ఉండే వేడి తగ్గించడానికి చెమట పట్టడం అనేది ముఖ్యమైన విధి. కానీ కొన్నిసార్లు శరీరానికి అధికంగా చెమటపడుతుంది. అలాంటి సందర్భాల్లో చర్మంపై ఉండే బాక్టీరియాకు చెమట తోడు కావడం వల్ల మన శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అధికంగా చెమట పట్టడాన్ని పామోప్లాంటర్ హైపర్ హైడ్రోసిస్ అంటారు. చంకలు, పాదాలు, అరచేతుల్లో ఎక్కువగా చెమట పట్టడం వల్ల ప్రతి ఒక్కరూ అసౌకర్యంగా భావిస్తుంటారు. అధికంగా చెమట పట్టడానికి చాలా కారణాలుంటాయి. ఆత్రుత, ఆందోళన, మానసిక ఒత్తిడి, కారంగా ఉండే ఆహారాలు అధికంగా తినడం ఎక్కువగా చెమట పట్టడానికి ప్రధాన కారణాలు. ఒక్కోసారి మధుమేహం ఉన్నవారిని కూడా అధిక చెమట బాధిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నవారు వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఒక్కోసారి స్థూలకాయం, కారణం తెలియని జ్వరం వల్ల కూడా చెమటలు అధికంగా పోస్తుంటాయి. సాధారణంగా అధిక చెమట సమస్య యవ్వనంలో ప్రారంభమవుతుంది. మెనోపాజ్‌ దశకు చేరుకుంటున్నప్పుడు, చేరుకున్న తర్వాత హార్మోన్‌ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల కారణంగా కూడా చెమటలు పడుతుంటాయి. శరీరంలోని ఇతర భాగాల కంటే అరికాళ్లు, అరచేతుల్లో అధిక చెమట పట్టడానికి కారణం శరీరంలోని ఉష్ణోగ్రత కంటే భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులేనని ఆయుర్వేద డాక్టర్ శ్యాం వీఎల్ వివరించారు. నిద్ర పోయే సమయంలో పామోప్లాంటర్ హైపర్ హైడ్రోసిస్ తలెత్తే అవకాశం లేదని, తద్వారా అధిక చెమట పట్టదని ఆయన పేర్కొన్నారు.

అధిక చెమట నివారణకు పరిష్కార మార్గాలు:

1) చల్లని బ్లాక్ టీలో ముంచిన మెత్తని గుడ్డతో అరచేతులను తుడవాలి. బ్లాక్ టీలో టానిక్ ఆమ్లం ఉంటుంది. ఇది రక్తస్రావాన్ని నివారించగలుగుతుంది. బ్లాక్ టీలోని ఆస్ట్రిజెంట్ లక్షణాల వల్ల నేచురల్ యాంటీపెర్సెపిరెంట్‌గా పనిచేస్తుంది. దీంతో ఇది చెమట ప్రవాహాన్ని
నియంత్రిస్తుంది. తరచుగా ఈ పని చేయడం వల్ల అనుకున్న ఫలితం కనిపిస్తుంది.
2) బ్లాక్ టీలో 20 నిమిషాల పాటు మీ అరచేతులను ఉంచినా మంచి ఫలితం కనిపిస్తుంది
3) కొద్ది నీటిలో గంధం వేసి పేస్టు చేయండి. దీనిని అరచేతులు, అరికాళ్లు, చంకలు వంటి ప్రదేశాల్లో రాసుకోండి. గంధం బదులు అలోవెరా జెల్‌ను
రాసినా మంచి ప్రయోజనం ఉంటుంది.
4) అధిక కారాలు ఉండే ఆహారాలు, వేడివేడి ఆహార పదార్థాలను తినడం మానండి. ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత క్షీణించే
అవకాశం ఉంటుంది.
5) తెల్లని ఉల్లిపాయ, బ్రకోలి, బీఫ్, లివర్ వంటి పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి.
ఒకవేళ ఈ చిట్కాలను ప్రయోగించినా సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close