Top newsTrending newsViral news
మళ్లీ ఆకాశం అంచులకు తాకిన బంగారం ధర చూస్తే షాక్ అవుతారు
It would be a shock to see the price of gold touching the edges of the sky again

బంగారం ధర మళ్లీ పెరిగింది. మరోసారి రూ.50వేల మార్కు దాటింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర గ్రాముకు రూ.496 మేర పెరిగి రూ.50,297లకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధర పెరగడం, రూపాయి విలువ క్షీణించడం ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు వెండి సైతం కేజీకి రూ.2,249 మేర పెరిగింది. దీంతో దిల్లీలో కేజీ వెండి ధర రూ.69,477కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1898 డాలర్లు, వెండి ఔన్సు ధర 26.63 డాలర్లుగా ఉంది. ఓ వైపు కరోనా వైరస్ వ్యాక్సిన్ వస్తోందన్న ఊరట కంటే మళ్లీ కేసుల పెరుగుతున్నాయన్న భయాలు అధికంగా ఉండడడం బంగారం ధర పెరుగుదలకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ అన్నారు. యూరప్ సహా కొన్ని చోట్ల మళ్లీ ఆంక్షలు విధిస్తుండడం ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఆందోళనలు పెంచుతున్నాయని చెప్పారు.