Trending news

మటన్ ముక్క ఎంత పని చేసింది ?? పొట్టుపొట్టుగా తన్నుకున్న బంధువులు

[ad_1]

పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరఫు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో బుధవారం జరిగింది. ఎస్సై వినయ్, గ్రామస్థుల కథనం ప్రకారం.. నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి స్థానిక ఓ ఫంక్షన్‌హాలులో వివాహం జరిపించారు. అనంతరం విందులో.. వరుడు తరఫు నుంచి వచ్చిన కొందరు యువకులకు మాంసాహారం వడ్డించారు. కానీ మటన్‌ ముక్కలు తక్కువ వేశారంటూ వారు.. వడ్డించే వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై వధువు బంధువులు కల్పించుకోవడంతో ఇరు పక్షాల మధ్య గొడవ తీవ్రమైంది. వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడటంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. ఇరు వర్గాలకు చెందిన 17 మందిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు. గాయపడిని వారిని నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

50 ఆవులను నదిలోకి తోసేసిన ఆకతాయిలు.. దాదాపు 20 ఆవులు మృతి

అమెరికాను వణికిస్తోన్న ప్రాణాంతక “ట్రిపుల్‌ ఈ’ వైరస్‌

దెయ్యాలతో లాంగ్‌ జంప్‌ పోటీలు.. నిర్వహించిన యమధర్మరాజు !!

అభిమానులకు స్వయంగా భోజనం వడ్డించిన స్టార్‌ హీరో

[ad_2]

Related Articles

Back to top button
Close
Close