Trending news

మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన మద్యం ధరలు.. పెరిగిన పాల రేట్లు

[ad_1]

మద్యం ప్రియులకు శుభవార్త. నేటి నుంచి విదేశీ మద్యం ధరలు తగ్గనున్నాయి. కొత్త టారిఫ్‌లు సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త మద్యం ధరలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇది మన ఏపీలో, తెలంగాణలోనూ అనుకుంటూ పొరపాటే ఇది అసోం రాష్ట్రంలో.

ఎక్సైజ్ శాఖ విదేశీ మద్యం ధరను తగ్గించింది. 5 శాతం ఆల్కహాల్ కలిగిన 650 ఎంఎల్ బీరు ధరపై రూ.22 తగ్గింది. 5 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న 650 ఎంఎల్ బీర్ ధర రూ.34 తగ్గింది. సాధారణ బ్రాండ్ 750 ఎంఎల్ రమ్‌పై రూ.117 తగ్గింది. 750 ఎంఎల్ రెగ్యులర్ బ్రాండ్ విస్కీ, జింక్ ధర రూ.144 తగ్గింది.

ఇది కూడా చదవండి: BSNLలో అద్భుతమైన ప్లాన్‌.. రూ.997తో 160 రోజుల వ్యాలిడిటీ.. మరి ఎయిర్‌టెల్‌, వీలో..

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి విదేశీ మద్యం ధరలను పెంచారు. అయితే ధరల పెంపు తర్వాత మద్యం ఆదాయం తగ్గడంతో మళ్లీ మద్యం ధర తగ్గింది.

పాల ధర పెంపు

మద్యం ధరలు తగ్గనుండగా, నేటి నుంచి పాల ధరలు పెరగనున్నాయి. గువాహటి డెయిరీ ట్రేడర్స్ అసోసియేషన్ (జిడిఎ) గురువారం విలేకరుల సమావేశంలో పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. గ్రేటర్ గౌహతి పశువుల పెంపకందారుల సంఘం పాల ధరను పెంచడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 17 నుంచి పాలపై లీటరుకు రూ.2.60 పెంచినట్లు పాల వ్యాపారుల సంఘం తెలిపింది. పాల ధర లీటరుకు రూ.3 పెంచినట్లు గ్రేటర్ గౌహతి డెయిరీ ట్రేడర్స్ అసోసియేషన్ తెలిపింది.

ధరల పెంపుతో సామాన్య ప్రజలు లీటరు పాలను రూ.67కి కొనుగోలు చేయాల్సి వస్తోంది. కంపెనీ ప్రస్తుతం పాలను హోల్‌సేల్ ధరకు రూ.3 పెంచింది. అందువల్ల రిటైల్ విక్రయాలు సెప్టెంబర్ నుంచి పాల రిటైల్ ధర రూ.67 అవుతుంది.

ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్‌లో 5 స్టార్ సౌకర్యాలు.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

[ad_2]

Related Articles

Back to top button
Close
Close