Top newsTrending newsViral news

భారీగా తగ్గిన బంగారం ధర ఏకంగా 1500 హైదరాబాదులో ఎంత అంటే

The price of gold has plummeted to around Rs 1,500 in Hyderabad

బంగారం ధరలు ఈ వారం కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా పసిడి ధరల్లో మార్పులు, దేశీయంగా డిమాండ్ వంటి వివిధ కారణాలతో గత సోమవారం నుండి శనివారం వరకు పసిడి మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. ఆదివారం ట్రేడింగ్ ఉండనందున అంతకుముందు సెషన్‌కు కొద్ది మార్పులతో పసిడి విక్రయాలు జరుగుతాయి. పసిడి ధరలు గత మూడు వారాలుగా తగ్గుముఖం పడుతున్నాయి. మధ్యలో స్వల్పంగా పెరిగినప్పటికీ మొత్తానికి గరిష్ట ధరల నుండి వేలల్లో తగ్గుదల నమోదుచేసింది.

హైదరాబాద్, ఢిల్లీల్లో బంగారం ధరలు
హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ.53,580 పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.49,100 కంటే పైన పలికింది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి రూ.54,550, 22 క్యారెట్ల పసిడి రూ.50వేలు పలికింది. రెండు రోజుల్లో రూ.800 కంటే పైన తగ్గిన పసిడి అతి స్వల్పంగా పెరిగింది. కిలో వెండి రూ.66,350 పలికింది. శుక్రవారం ఎంసీఎక్స్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం ఎగిసి రూ.51,400 పలికింది. బంగారం ధరలు ఆగస్ట్ 7 గరిష్ట ధర నుండి రూ.5వేల కంటే ఎక్కువగా తగ్గాయి.

వారంలో రూ.1500 తగ్గిన పసిడి
గత వారంలో ఆగస్ట్ 24వ తేదీ నుండి ఆగస్ట్ 29వ తేదీ వరకు పసిడి ధరలు ఒక్కరోజు మినహా ప్రతిరోజు ఎంతోకొంత తగ్గాయి. అయితే స్వల్ప తగ్గుదలతో ముగిశాయి. మొదటి మూడు రోజుల్లో దాదాపు రూ.1500 తగ్గింది. మరుసటి రోజు రూ.600కు పైగా పెరిగింది. తర్వాత వరుసగా రెండు రోజులు తగ్గింది. వారం మొత్తంలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర సోమవారం దాదాపు రూ.50,500 వద్ద ప్రారంభమైంది. శనివారం నాటికి రూ.దాదాపు రూ.1500 తగ్గి రూ.49,100కు ఎగువన ముగిసింది. 24 క్యారెట్ల పసిడి పసిడి సోమవారం రూ.55 వేల కంటే పైన పలికింది. శనివారం నాటికి రూ.1500 వరకు తగ్గి దాదాపు రూ.53,600 వద్ద ముగిసింది.

అమ్మకాల ఒత్తిడి
అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు, కరోనా మహమ్మారి కేసులు, వ్యాక్సీన్, ట్రేడ్ వార్, భౌగోళిక పరిస్థితుల ప్రభావం పసిడిపై ఉంటుంది. వ్యాక్సీన్‌పై ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోవడం, రష్యా వ్యాక్సీన్ ఇప్పటికే రావడంతో ఇన్వెస్టర్లు గందరగోళంలో ఉన్నారు. బంగారం అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటోంది. రష్యా వ్యాక్సీన్ వచ్చిన ఆగస్ట్ 12వ తేదీ మరుసటి రోజు నుండి అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close