భారత దేశంలో ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాని రాష్ట్రం అంటే ఇదే ఇదే
This is the only state in India where no single corona virus case has been registered
ఓ వైపు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షలు దాటింది. కానీ లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతంలో మాత్రం ఇంతవరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నాగాలాండ్, సిక్కిం కూడా కరోనా ఫ్ర రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ మధ్యనే సిక్కింలో కూడా ఓ కరోనా కేసు నమోదైంది. నాగాలాండ్ లో కూడా కరోనా కేసు నమోదైంది.
లక్షద్వీప్ విషయానికొస్తే ఈ ద్వీపం కరోనా ఫ్రగా ఉండటం వెనుక అక్కడి అధికార యంత్రాంగం కృషి చాలా ఉంది. కరోనా తొలి అలన్ట్ వచ్చిన నాటి నుంచే ఇక్కడ కట్టుదిట్టమైన చర్యలను అమలుచేస్తూ వస్తున్నారు. ముందస్తు సంసిద్దత, ప్రతీ ఒక్కరికీ కరోనా టెస్టులు, కఠినమైన క్వారెంటైన్ చర్యల కారణంగా కరోనా బారిన పడకుండా ఉన్నారు. 60వేల జనాభా కలిగిన లక్షద్వీప్ తమ మెడికల్ అవసరాల కోసం ఎక్కువగా కేరళ పైనే ఆధారపడుతోంది. ఆ రాష్ట్రంతో సమన్వయం చేసుకుంటూ పకడ్చంది చర్యలకు పూనుకుంది.
లక్షద్వీప్ హెల్త్ సెక్రటరి సుందర వడివేలు పలు విషయాలు తెలిపారు. ఆయన ఏమన్నారంటే.. మొదట్లోనే మేము రాకపోకలను నియంత్రించగలిగాం. తొలుత విదేశీ యాత్రికులపై నిషెధం,ఆపై స్వదేవీ యాత్రికులపై కూడా నిషిధం విధించాం. లాక్ డౌన్ పేరియడ్‌లో అత్యవసర సేవలు మినహా అన్ని రకాల రాకపోకలను నిషెధించాం. వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయిన లక్షద్విప్ స్థానికుల్స్ కొందరు తిరిగి వచ్చేస్తామంటే వారందరికీ కొచ్చి, మంగళూరుల్లో ఆర్‌టీ-పిసఆర్ ప్రక్రియలో కరోనా టెస్టులు నిర్వహించాం. నెగటివ్‌గా తేలితేనే వారిని లక్షద్వీప్‌లోకి అనుమతించాం. పరీక్షల్లో అందరికీ నెగటివ్‌గానే నిర్దారణ అయింది అని ఆయన తెలిపారు.
లాక్ డౌన్ తొలినాళ్లలో లక్షద్వీఫ్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రజలందరికి కరోనాపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ద్విపంలొని మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా కరోనాపై అవగాహన కలిగేలా చేశారు. ఇందుకోసం ఆశావర్కర్స్, అంగన్‌వాడిలను ఉపయోగించుకుని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. ఈ క్రమంలో ఎవరికైనా కోవిడ్ 19 లక్షణాలు ఉంటే వారు హెల్ప్ లైనకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చేవారు. దింతో వైద్యులు అక్కడికి వెళ్లి అనుమానితుల శాంపిల్స్ తీసుకుని వాటిని కేరళలోని ల్యాబికి పంపించేవారు. అలా పంపించిన శాంపిల్స్ అన్నీ నెగటివ్‌గానే తేలాయి.
ముందు జాగ్రత్తలో భాగంగా.. లక్షద్వీప్ వెలుపలి నుంచి వచ్చినవారికి నెగటివ్‌గా తేలినా సరే.. 14 రోజుల పాటు వారిని హోమ్ క్వారెంటైన్ చేశారు. అంతేకాదు,వారి కుటుంబాలను కూడా క్వారెంటైన్‌లో ఉంచారు. ఇదే క్రమంలో ఏప్రిల్ మొదటివారంలో కవరత్తిలోని ఇందిరా గాంధి ఆసుపత్రిని ప్రత్యేకించి కోవిడ్-1 9 కోసం కేటాయించారు. ఇందులో ఐసోలేషన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 11 క్వారెంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ వాటిని ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడలేదు. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ కంటే మరింత మెరుగ్గా ఇక్కడి క్వారెంటైన్ కేంద్రాల్లో సదుపాయాలను ఏర్పాటు చేశారు.