బ్రేకింగ్ న్యూస్ Lockdown పై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది
The Center has issued guidelines on Breaking News Lockdown

లాక్ డౌన్ కు సంబంధించి కేంద్రం కొన్ని మార్గదర్శకాలను బుధవారం జారి చేసింది. ఇందులో కొన్నింటికి
మినహాయింపునిచ్చింది. ఇవి ఏప్రిల్ 20 తర్వాత అమల్లోకి వస్తాయి. అప్పటి వరకు యదావిధిగానే లాక్ డౌన్ కొనసాగుతుంది. కేంద్రం జారి చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
– రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణా బంద్.
– దేశ వ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు అనుమతి.
– గ్రామీణ ప్రాంతాల్లొ పరిశ్రమల నిర్వహణకు అనుమతి.
– పరిమితంగా నిర్మాణ రంగాలకు అనుమతి.
– కాఫీ,తేయాకుల్లో 50 శాతం మ్యాన్ పవర్ కు అనుమతి.
– పట్టణ పరిధిలో లేని అన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి.
– నిర్మాణ రంగ పరిశ్రమలకు సంబంధించిన స్థానికులకు మాత్రమే అనుమతి.
– గ్రామాల్లొ భవన, ఇళ్ల నిర్మాణ రంగ కార్యకాలపాలు నిర్వహించుకోవచ్చు.
– అన్ని రకాల ఈ కామర్స్ సర్విసులకు అనుమతి.
– పబ్లిక్ లో ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలి.
– హాట్ స్పాట్ కేంద్రాలలో జనసంచారం ఉండకూడదు.
– ఆరుబయట ఉమ్మి వేయడం ఇకపై చట్ట ప్రకారం నేరం. దానికి జరిమానా విధింపు.
– హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంఫ్లక్సులు, జిమ్‌లు, స్పోర్ట్ న కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు మే 3 వరకు ఆతరవకూడదు.
– రాష్ట్రాల మధ్య, అలాగే జిల్లాల మధ్య ప్రజల ప్రయాణాలు, రాకపోకలపై మే 3 వరకు నిషేధం.
– సామాజిక, రాజకీయ, క్రీడా, మతపరమైన కార్యక్రమాలు, వేడుకలు, ఫంక్షన్లు నిర్వహించకూడదు.
– అన్ని ప్రార్ధనా స్టలాలూ, దేవాలయాలు బంద్.
– విద్యాసంస్థలు, ట్రైనింగ్, కొచింగ్ కేంద్రాలు తెరవకూడదు.
– అంత్యక్రియల కార్యక్రమాల్ల 20 మందికి మించి పాల్త్‌నకూడదు.
– ఆస్పత్రులు, నర్సింగ్ హోము, క్లినిక్స్, టెలిమెడిసిన్ సర్విసులు రోజూ పనిచేస్తాయి. జన బొషధి కేంద్రాలు తెరిచే ఉంటాయి.
– మెడికల్ ల్యాబ్స్, వైద్య ఉత్పత్తుల కలెక్షన్ కేంద్రాలు తెరిచే ఉంచవచ్చు.
– ఉపాధి హామీ పనులకు అనుమతి. ఉపాధి హామీ కూలీలు భౌతిక దూరం పాటిసూ మాస్కులు ధరించి పని చేయాలి.
– గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి,తాగునీటి ప్రాజెక్టులకు అనుమతి.
– లిక్కర్,గుట్కా,పాగాకు ఉత్పత్తుల పై నిషధం.
– ఎంట్రీ,ఎగ్టీట్ ప్రాంతాలలో శానిటైజేషన్ తప్పనిసరి.
– కార్యాలయాల్లొ ఒకరికొకరికి మధ్య 6 అడుగుల దూరం ఉండాలి.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలూ లాక్‌డౌన్ నిబంధనల్ని కఠినంగా అమలు చెయ్యాలని కేంద్రం ఆదేశించింది. అవసరహష్టైతే రాష్ట్రాలు స్థానికంగా అవసరాన్ని బట్టి ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్రం తన మార్గదర్శకాల్తొ తెలిపింది.