Trending news

బాబోయ్‌..హైదరాబాద్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం..

[ad_1]

రాజేంద్రనగర్ సర్కిల్ పరిదిలోని హసన్ నగర్ లో ఒ భారీ కొండచిలువ సంచరించింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొండ చిలువ జనాల్లోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. హసన్ నగర్ లోని అయిస్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన కొండచిలువను చూసిన జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ కొండచిలువను చూసిన ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైయ్యారు. వెంటనే ఆ కొండచిలువను పట్టుకునేందుకు స్నేక్‌ క్యాచర్‌కు కాల్‌ చేసి రప్పించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ హకీమ్ మీర్ షెఖిల్ అలి రిస్క్యూ చేసి భారీ కొండచిలువను పట్టుకున్నాడు. కొండచిలువ 20 ఫీట్ల పొడవు ఉండడంతో కంగుతిన్నారు. వన్యప్రాణులు అడవులను వదలి జనవాసాల మధ్యకు చేరుకుంటుండంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే పోలీసులకు,అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు స్ధానికులు. తాను 40 ఏళ్ళుగా పాములను రెస్క్యూ చేస్తున్నానని చెప్పారు. పాము కనిపిస్తే తనకు ఫోన్ చెయ్యాలని ఫోన్ నెంబరు ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

[ad_2]

Related Articles

Back to top button
Close
Close