బంపర్ ఆఫర్ కేవలం 15 వేల రూపాయలతో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని సొంతం చేసుకోండి ఇలా
Bumper offer to own a Royal Enfield bike for just Rs 15,000

ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల బైక్స్ వస్తూనే ఉన్నాయి. రోజుకొక మోడల్ లు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. కానీ ఎన్ని రకాల బైక్స్ వచ్చినప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కి ఉన్న క్రేజ్ మాత్రం చాలా ప్రత్యేకం. బైక్ లలో రారాజుగా రాయల్ ఎన్ ఫీల్డ్ ని చెప్పుకుంటారు. ప్రస్తుత కాలంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వినియోగం పెరిగింది. యువత మరింత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో ఇక ఈ బైక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ పండుగ సీజన్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి ప్రస్తుతం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.
తక్కువ డౌన్ పేమెంట్ చెల్లించి మీకు ఎంతో ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రస్తుతం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం 15 వేల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఒకవేళ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్ కొనుగోలు చేయాలని భావిస్తే డౌన్ పేమెంట్ 20 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అతి తక్కువ డౌన్ పేమెంట్ తోనే ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటికి తీసుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సదవకాశం అని చెప్పాలి.
ఇక 15 వేల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించిన తర్వాత మిగతా డబ్బులు బ్యాంకు నుంచి లోన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ రుణాన్ని మొత్తం ఐదేళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్సైట్లో ఫైనాన్స్ అనే ఆప్షన్ కూడా ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉంది. మీరు బుల్లెట్ బైక్ కొనేందుకు రూ.15 వేలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే.. ఇంకా మీరు రూ.1.37 లక్షలకు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు 36 నెలల ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే మీకు ప్రతి నెలా దాదాపు రూ.5 వేల ఈఎంఐ పడుతుంది. ఇక్కడ వడ్డీ రేటు 9.7% శాతంగా పరిగణలోకి తీసుకుంటారు.