ఫిబ్రవరిలో అమల్లోకి రానున్న బడ్జెట్ లలో వచ్చే కొత్త రూల్స్ ఇవే
These are the new rules in the budgets that will come into force in February

ఫిబ్రవరిలో కొన్ని రూల్స్ అమలులోకి రానున్నాయి. ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనుండగా పలు రంగాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ట్యాక్స్ విధానాల్లో మార్పులు, సరికొత్త రాయితీలు, ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు, ఫాస్టాగ్ లాంటి అంశాల్లో మార్పులు రానున్నాయి. ఫిబ్రవరిలో ఏ రూల్స్ అమలులోకి వస్తాయో తెలుసుకోండి.
కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఇప్పటికే 50 % సీటింగ్ సామర్థ్యంతో నడుస్తున్న సినిమా హాళ్లు, థియేటర్లలో మరిన్ని సీట్లు బుక్ చేసేందుకు అనుమతి ఇచ్చింది.
ఫిబ్రవరి 1న ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్ని ఆయిల్ కంపెనీలు సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధరలను దృష్టిలో పెట్టుకొని ధరలను సవరిస్తూ ఉంటాయి. డిసెంబర్ నుంచి సిలిండర్ ధర పెరుగుతూ వస్తోంది. మరి ఈసారి సిలిండర్ ధర తగ్గుతుందో పెరుగుతుందో చూడాలి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త ఏటీఎం రూల్స్ ను గుర్తుంచుకుని, పాటించాల్సి ఉంటుంది. ఏటీఎం యాక్టివిటీస్ ఎక్కువగా చేయటాన్ని నియంత్రిస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈనెల 14న ఓ ట్వీట్ చేసింది. ఏటీఎంల్లో నగదు బదిలీ చేసే క్రమంలో ఎన్నో మోసాలు జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఏటీఎం ట్రాన్సాక్షన్స్ లిమిట్ ను నియంత్రిస్తున్నాం.. గో డిజిటల్ స్టే సేఫ్ అంటూ ప్రకటన చేసింది.
ఈ నేపథ్యంలో మీరు పీఎన్ బీ ఏటీఎం యూజర్ అయితే ఇక డిజిటల్ పేమెంట్ గేట్ వే లను డౌన్ లోడ్ చేసుకుని, వీటికి అలవాటు పడాల్సి ఉంటుంది. పీఎన్ బీ నాన్-ఈఎంవీ ఏటీఎం మెషీన్ల వినియోగదారులు ఆన్‌లైన్ పేమెంట్స్ కు మానసికంగా సిద్ధంగా ఉండండి. నాన్-ఈఎంవీ ఏటీఎం మెషీన్లు అంటే ఏటీఎం కార్డు లేకుండానే ట్రాన్సాక్షన్స్ జరిపే సౌకర్యాన్ని కల్పిస్తాయి, అదే ఈఎంవీ ఏటీఎం మెషీన్లయితే మీరు ఏటీఎం మెషీన్ లోకి కార్డు పెడితే అది చిప్ లోని డేటా రీడ్ చేసి ట్రాన్సాక్షన్స్ ను అనుమతిస్తుందన్నమాట. కాబట్టి మీరు నాన్-ఈఎంవీ ఏటీఎం వినియోగదారులా కాదా, లేక ఈఎంవీ ఏటీఎం మెషీన్ల యూజర్లైతే తక్షణం పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వెళ్లి కార్డు అప్ డేట్ చేసుకోవటం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇందుకు మీ సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచును సంప్రదించండి.
ఫిబ్రవరి 15 నుంచి అన్ని వాహనాలకు తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండి తీరాల్సిందే. హైవేపై ప్రయాణించాలంటే టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలుపుదల చేయనున్న నేపథ్యంలో అన్ని రకాల వాహనాలకు ఫాస్టాగ్ ఉండాలి. ఫాస్టాగ్ లేకపోతే హైవేపై, ఔటర్ రింగ్ రోడ్ పై ప్రయాణించటం కుదరదు. ఈ మేరకు సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్ ను కేంద్రం జారీ చేసింది.
పెన్షనర్లు ప్రతి ఏటా సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ పత్రం)ను సమర్పించేందుకు ఫిబ్రవరి 28, 2021ను డెడ్ లైన్ గా ప్రకటించిన నేపథ్యంలో మీరు సీనియర్ సిటిజన్ అయినా, మీ ఇంట్లో సీనియర్ సిటిజన్లు ఉన్నా వారి లైఫ్ సర్టిఫికేట్ ను పీఎఫ్ ఆఫీసులో ఫిబ్రవరి నెలాఖరులోగా సమర్పించండి.