ప్రియుడితో బీచ్లో బిగ్ బాస్ బ్యూటీ బీభత్సం.. రచ్చ రచ్చ చేసిందిగా..

[ad_1]
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు. ఈ బ్యూటీ యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ ద్వారా ఇనయా పాపులర్ అయ్యింది . ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది.
బిగ్బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఈ బ్యూటీ తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సినిమాలతో బిజీ అవుతుందేమో అని అనుకున్నారు కానీ అలా జరగలేదు.
సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోషూట్స్, రీల్స్ అంటూ తెగ హడావిడి చేస్తుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం తన ప్రియుడిని కూడా పరిచయం చేసింది ఇనయా సుల్తానా.
అతడి పేరు గౌతమ్ కొప్పిశెట్టి. అతను యోగా ట్రైనర్ అండ్ జిమ్ కోచ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం గౌతమ్ తో కలిసి జోరుగా షికార్లు చేస్తోంది ఇనయా. అందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది.
తాజాగా ఈ ఇద్దరూ బీచ్ లో రొమాంటిక్ ఫోజులిస్తూ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇనయా సుల్తానా. ఈ ఫొటోల్లో ఇనయా తన ప్రియుడితో రెచ్చిపోయి ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
[ad_2]
Source link