పీఎం కిసాన్ సమ్మన్ నిధి డబ్బులు రావట్లేదా అయితే వెంటనే ఇలా చేయండి లేదంటే డబ్బులు రావు?
PM Kisan Summon Fund If the money does not come, do it immediately or the money will not come?

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ఏడో విడత డబ్బులు రైతుల అకౌంట్లలో రూ.2,000 చొప్పున జమ అవుతున్నాయి. కొందరు రైతులకు రూ.2000 జమ కాలేదు. ఆధార్ నెంబర్ సరిగ్గా లేకపోవడం, అకౌంట్ నెంబర్ తప్పుగా ఉండటం, రైతులు సమర్పించిన డాక్యుమెంట్లలో పేర్లు ఒకేలా లేకపోవడం.. అంటే పేర్లలో చిన్నచిన్న మార్పులు ఉండటం, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండటం లాంటి కారణాల వల్ల లక్షలాది మంది రైతులకు అకౌంట్లలో డబ్బులు జమ కావట్లేదు.
కేంద్ర ప్రభుత్వం రైతులు తాము సమర్పించిన వివరాలను అప్ డేట్ చేసుకునే అవకాశం ఇస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ లో రైతులు తమ వివరాలను సరిచేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి.
తప్పుల్ని ఇలా సరిచేయండి..
– ముందుగా https://pmkisan.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
– అందులో Farmers Corner సెక్షన్ లో Edit Aadhaar Failure Records పైన క్లిక్ చేయాలి.
– కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Aadhar Number, Account Number, Mobile Number, Farmer Name అని ఉంటాయి.
– మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సరైన వివరాలు ఎంటర్ చేసి ఇమేజ్ టెక్స్ట్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
-సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత రైతు పేరు, తండ్రి పేరు, జెండర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, సబ్ డిస్ట్రిక్ట్ పేరు, బ్లాక్ పేరు, ఊరి పేరు లాంటివి ఉంటాయి.
– ఈ వివరాల్లో ఏదైనా తప్పు ఉండే Edit పైన క్లిక్ చేయాలి.
– ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
– అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి సేవ్ చేయాలి.
– వెరిఫికేషన్‌లో మీ వివరాలన్నీ మ్యాచ్ అయితే మీకు పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్ లోకి వస్తాయి.
తప్పులు సరిదిద్దుకోవడంలో సమస్యలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారుల్ని సంప్రదించాలి. లేదా పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్: 011-24300606, 155261, 0120-6025109, పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్: 18001155266, పీఎం కిసాన్ ల్యాండ్ లైన్ నెంబర్: 011-23381092, 23382401 నెంబర్లను సంప్రదించాలి. pmkisan- ict@gov.in మెయిల్ ఐడీకి కంప్లైంట్ చేయొచ్చు.