పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసిన తెలంగాణ సర్కార్
Telangana Sarkar postponed 10th class exams

తెలంగాణలో పదో తరగతి పరిక్షలను సర్కార్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే పదో తరగతి పరిక్షల పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్‌ఎంసి పరిధితో కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో జీహెచ్‌ఎంసి పరిధిలో కాకుండా మిగిలిన ప్రాంతాల్లొ పరిక్షలు నిర్వహించాలని సర్కార్ కు హైకోర్టు ఆదేశాలిచ్చింది. కానీ అలా నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర వ్యాప్తంగా పరిక్షలను సర్కార్ వాయిదా వేసింది.
పదో తరగతి పరిక్షలను పూర్తిగా రద్దు చేసి గతంలో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేణ్లు ఇచ్చేందుకు సర్కార్ ఆలోచన చేస్తుందని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే సరైన పద్దతని విద్యాశాఖాధికారులు అంటున్నారు. ఫ్ర ఫైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. సమ్మెటివ్ అసెస్‌మెంట్-1 లో వచ్చిన మార్కుల ఆధారంగా చేసుకొని గ్రేణ్గు ఇవ్వొచ్చని కొందరు సూచిస్తున్నారు. కానీ ఈ ప్రాసెస్
అంతా జరగాలంటే అన్ని పాఠశాలల నుంచి విద్యార్దుల మార్కుల జాబితాను తెప్పించుకోవాలి. ఇది కాస్త ఆలస్యమయ్యే పని అని చెప్పవచ్చు.
సమ్మెటివ్,ఫ్ర ఫైనల్ పరీక్షలకు కొంత మంది విద్యార్దులు గ్రైర్దాజరయ్యారని వారిని ఏ విధంగా తీసుకొని గ్రేడింగ్ కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా పదో తరగతి పరిక్షలను రద్దు చేసి గ్రేడింగ్ ద్వారా ఫలితాలు ఇచ్చేందుకే సర్కార్ మొగ్గు చూపుతుందని తెలుస్తోంది.