నోరూరించే హలీం మీ ఇంట్లో చిటికెలో ఈ విధంగా చేసుకోండి
Do this in a pinch at your house

రంజాన్ మాసం వస్తే చాలు మనకు వినిపించే పేరు హలీమ్. హలీమ్ గొప్పదనమంతా దాన్ని వండటంలోనే ఉంటుంది. అనేక పోషకపదార్దాలు ఉండే ఈ హలీమ్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమరవ్వను నాలుగు గంటలు నీటిలో నానబెడతారు. తర్వాత నీటిని ఒంపెసి మాంసం, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మసాలాలతో కలిపి పన్నెండు గంటల పాటు ఉడకబెడతారు. తర్వాత దాన్ని మెత్తని పెస్ట్ లా అయ్యేవరకూ కర్రలతో కలియబెడతారు. ఇలా చేయడాన్ని గోటా కొట్టడం అంటారు. గోటా కొట్టిన తరువాతే హలిమ్ ఘుమఘుమలు మొదలవుతాయి. ఆపైన ఉల్లిపాయ ముక్కలు, బాదం పప్పు, జీడిపప్పు తదితర డ్రై ఫ్రూట్స్ ని నేతిలో వేయించి హలీంలో కలుపుతారు.
తినేముందు కొత్తిమీర, పుదినా, నిమ్మరసం చల్లి ఇస్తారు. ఎట్టి పరిస్టితుల్ల్ నూ చల్లారకుండా బట్టిల్లో వేడి మీదే ఉంచుతారు. అందుకే ఎప్పుడు హలీమ్ తిన్నా వేడిగానే ఉంటుంది. ఇంత ప్రత్యేకంగా తయారు చేయబట్టే హలీమ్ అన్నింట్లోకీ ప్రత్యేకంగా నిలిచింది. హలీమ్ లో నిండుగా ఉండే పోషకాలు అదనపు శక్తినిస్తాయి. పప్పుధాన్యాలు, నెయ్యి, తాజా మాంసం, డ్రై ఫ్రూట్స్ వంటివి ఎంతో బలవర్ధకం. అందుకే హలీమ్ రంజాన్ మాసపు ప్రత్యేక ఆహారమయ్యింది. మటన్, చికెన్ లతో పాటు వెజిటేరియన్స్ కోసం వెజ్ హలీమ్ కూడా దొరుకుతుంది. మటన్ తో చేసేదాన్ని హలీమ్ అనీ, చికెన్ తో చేసేదాన్ని హరీస్ అనీ అంటారు. పేరు ఎదైనా పదార్థాలు ఎవైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా హలీమ్ రుచి మహా అద్భుతం.