తెలంగాణ రైతులకు శుభవార్త సర్కారు రుణ మాఫీ ప్రక్రియను మొదలు పెట్టింది
The good news for Telangana farmers is that the government has begun the debt waiver process

తెలంగాణ సర్కార్ రుణమాఖ ప్రక్రయను వగవంతం చెసెంది. రూ.25 వేల లోపు రుణాలు తీసుకున్న వారికి ఈ నెలాఖరులోగాచెక్కులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో తెలిపింది. దీంతో అందుకు సంబంధించిన ప్రక్రయను అధికారులు ప్రారంభించారు. అసలు రుణమాఫీకి 40.66లక్షల మంది అర్హులు. వీరికి రుణమాఫీ చేయాలంటే 25,936 కోట్లు అవసరం. అందులో రూ.25 వేల లోపు రుణాలు తీసుకున్న వారు 5 లక్షల 83 వేల మంది. ఈ 5.83 లక్షల మందికి సంబంధించిన రుణమాఫఖ ప్రక్రియను అధికారులు బద్దం చేస్తున్నారు. వీరికి రూ.1 19/ కోట్ల రూపాయల రుణం మాఫి కానుంది. ఈ నిధులను ఆర్ధిక శాఖ ఇప్పుటిక విడుదల చేసినట్టు సమాచారం.
రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను కేటగిరీల వారీగా విభజించారు. రూ.25 వేల వరకు ఒక కేటగిరిగా, రూ.25 వేల నుంచి 50 వేల వరకు రెండో కేటగిరిగా, రూ.50 వేల నుంచి రూ./5 వేల వరకు మూడో కేటగిరిగా, రూ.75 వేల నుంచి లక్ష వరకు నాలుగో కేటగిరిగా విభజించారు.లక్ష పైన తీసుకున్నా లక్ష వరకు మాత్రమే రుణమాఫీ చేయనున్నారు. 2018 డిసెంబర్ 11 వరకు రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న వారికి రుణమాఫ చేయనున్నారు.
ఈ సారి బడ్జెట్ లో రుణమాఫికి రూ.6225 కోట్లు కేటాయించారు.రూ.25 వేల లోపు రుణాలు తీసుకున్న వారికి రూ.1 197 కోట్లు ఖర్చు అవుతుంది. రూ.25 నుంచి 50 వేలు తీసుకున్న వారికి రూ.3104 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఈ సారి కేటాయించిన బడ్జెట్ ద్వారా రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న వారికి కూడా మరో నెల రోజుల్లో చెక్కులు అందించే అవకాశం ఉంది. రూ.50 వెలకు పైగా రుణాలు తీసుకున్న వారికి సంబంధించి ప్రభుత్వం ఓ ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో రుణమాఫి సందర్భంగా జరిగిన తపృులు జరగకుండా అధికారులు జాగత్తలు తీసుకుంటున్నారు.