
తెలంగాణలో మరోసారి మద్యం ధరలు పెరగనున్నాయా.. ? కొద్ది రోజుల క్రితమే మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం మళ్లీ లిక్కర్ రేట్లు పెంచేందుకు సిద్దమవుతుందా..? నిన్న సీఎం కేసిఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ సర్కార్ ఇటీవలే మద్యం రేట్లను పెంచింది. ఇక విద్యుత్ చార్జీల పెంపు కూడ త్వరలోనే ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీలో ప్రకటించారు. తాజాగా మరోసారి మద్యం ధరలను పెంచేందుకు సర్కార్ రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. మద్యపాన నిషేదం అనేది సాధ్యం కాదని స్వయంగా సిఎం కేసఆరే స్పష్టం చేశారు.
మద్యం ఆరోగ్యానికి మంచిది కాదంటూనే.. రేట్లు పెంచుతామని కేసిఆర్ స్పష్టం చేశారు. మద్యం తాగేవారిని నిరుత్సాహ పరిచేందుకే మద్యం ధరల పెంపు అని సిఎం అసెంబ్లీలో తెలిపారు. మద్యం ధరలు పెంచితేనైనా మందు తాగడం కొంతలో కొంతైనా మానుతారన్నది తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ప్రకటించారు. కాంగ్రెస్ పాలనలో మద్యం షాపులు లేనట్లు మాట్లాడుతున్నారని సఎం అన్నారు. గ్రామాల్లో గుడుంబా బట్టలు లేకుండా చేశామని, అవసరమైతే మద్యం ధరలు మళ్లీ పెంచుతామని సిఎం వెల్లడించారు. గతంలో మద్య నిషేధం అమలు చేస్తె అట్టర్ ఫ్లాప్ అయిందని గుర్తుచేశారు.
ఇక బ్రహ్మనందరెడ్డి, ఎన్టీఆర్, కోట్ల విజయబాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో మద్యపానం నిషిదం అమలు చేయడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. మొత్తమ్మీద సిఎం కేసఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనతో మద్యం ధరలు పెంపు త్వరలోనే ఉంటుందని స్పష్టమైంది. అయితే ఎంత మేరకు పెంచుతారన్నది చూడాల్సి ఉంది.