Top newsTrending newsViral news

డెక్సామెథాసోన్‌ కరోనా కి ఎలా పని చేస్తుందో తెలుసా

Did you know how dexamethasone works for corona

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని అంతం చేసే ఔషధం కోసం ప్రపంచదేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆయా దేశాల శాస్త్రవేత్తలు ఔషధ తయారీలో తలమునకలయ్యారు. కరోనాకు మందు కనుక్కోవటానికి ఇంకో సంవత్సరం పట్టే అవకాశం ఉందని అందరూ భావిస్తున్న సమయంలో ‘యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్’ ఓ శుభవార్త చెప్పింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కరోనా వైరస్‌ బాధితులకు ‘డెక్సామెథాసోన్’‌ అనే ఔషధం అద్భుతంగా పనిచేస్తుందని ప్రకటించింది. అత్యంత చౌకగా లభించే ఈ ఔషధం కరోనా బాధితుల్లో మూడింట ఒక వంతు మరణాలను తగ్గించినట్లు, ఆక్సిజన్‌ సపోర్టుపై ఉన్న బాధితుల్లో ఐదింట ఒక వంతు మరణాలను తగ్గించినట్లు తమ అధ్యయనంలో తేలిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి డెక్సామెథాసోన్‌పై పడింది. ( వెంటిలేటర్‌పై ఉన్న కరోనా బాధితులకు.

ఇంతకీ ఏమిటి ఈ డెక్సామెథాసోన్‌? ఎలా పనిచేస్తుంది?
డెక్సామెథాసోన్ అనేది ఓ స్టెరాయిడ్‌. అది మన శరీరంలో సహజ రక్షణ చర్యలను ప్రభావితం చేస్తుంది. మంట, వాపు, అలర్జీలను కలుగజేసే పదార్థాల ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఈ ఔషధం 1977నుంచి డబ్ల్యూహెచ్‌ఓ ఎసెన్సియల్‌ మెడిసిన్స్‌ లిస్ట్‌లో ఉంది. దాదాపు 1960నుంచి దీన్ని శరీర మంటలను తగ్గించటానికి, కొన్ని క్యాన్సర్ల చికిత్సలోనూ వాడుతున్నారు.

లాభాలు :
1) కీళ్ల వాతము
2) క్రోస్ వ్యాధి
3) సిస్టమిక్‌ లూపస్
4) సోరియాటిక్ ఆర్థరైటిస్
5) అల్సరేటివ్‌ కోలిటిస్‌
6) శ్వాసనాళాల ఉబ్బసం
7) అలెర్జీ రినిటిస్
8) డ్రగ్‌ ఇన్‌డూసుడ్‌ డెర్మటైటిస్‌
9) సీ కాంటాక్ట్‌, అటోపిక్‌ డెర్మటైటిస్‌
10)తీవ్రమైన సోరియాసిస్
11) పెంఫిగస్‌
12) ల్యుకేమియా
13) లింఫ్‌ గ్లాండ్‌ క్యాన్సర్‌
14) రక్త సంబంధ రోగాలు
మొదలైన వాటి నివారణలో ఈ స్టెరాయిడ్‌ను విరివిగా ఉపయోగిస్తుంటారు.

సైడ్‌ ఎఫెక్ట్స్‌ :
1) బరువు పెరగటం
2) అధిక రక్తపోటు
3) కడుపులో వికారం
4) మత్తు, తలనొప్పి
5) శరీరంలో పొటాషియం తగ్గుదల
6) సిరమ్‌లో గ్లూకోజ్‌ స్థాయిలను పెంచుతుంది(ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారిలో)
7) నిద్ర సంబంధ ఇబ్బందులు
8) బుతుక్రమం తప్పటం
9) అప్పిటైట్‌ పెరుగుదల
11) ఒత్తిడి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close