Trending news

జియో యూజర్లకు బంపర్ ఆఫర్ !! వెల్‌కమ్ ఆఫర్‌ కింద 100 జీబీ ఉచిత స్టోరేజీ

[ad_1]

రిలయన్స్‌ 47వ వార్షిక సాధారణ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 35 లక్షల మంది వాటాదారులను ఉద్దేశించి ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రసంగించారు. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల వంటి డిజిటెల్‌ కంటెంట్‌ను జియో యూజర్లు భద్రంగా దాచుకునేలా జియో క్లౌడ్‌ స్టోరేజీని దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద 100జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందిస్తున్నట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను భారతదేశంలో ప్రతీ ఒక్కరికి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. కంపెనీలో జారీ చేసే అదనపు వాటాలను ఇప్పటికే ఉన్న షేర్‌ హోల్డర్లకు ఉచితంగా ఇవ్వడాన్ని బోనస్‌ ఇష్యూ లేదా బోనస్‌ షేర్లు అంటారు. ఇప్పటికే వాటాదారుల వద్ద ఉన్న షేర్ల ఆధారంగా దీనిని కేటాయిస్తారు. అంటే రిలయన్స్‌ వాటా ఒకటి ఉంటే.. బోనస్‌ వాటా ఒకటి లభించనుంది. షేర్‌హోల్డర్లకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ వాటాలు ఇచ్చే ప్రతిపాదనను ఆమోదించేందుకు కంపెనీ బోర్డు సెప్టెంబర్‌ 5వ తేదీన సమావేశం కానుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vishal: మహిళల్ని వక్ర దృష్టితో చూసేవారికి శిక్ష పడాలి

నెలన్నరలో ఏడుగురు తోడేళ్లకు బలి !! ఆ గ్రామంలో జరుగుతున్న నరమాంస భక్షక భీభత్సం

[ad_2]

Related Articles

Back to top button
Close
Close