Top newsTrending newsViral news

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ ఫ్రీగా గ్యాస్ సిలిండర్స్ పొందండి ఇలా

Good news for gas consumers. Get gas cylinders for free

PMకరోనా వైరస్ దెబ్బకి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. ఉచితంగానే గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించింది. అయితే ఇది కేవలం ఉజ్వల స్కీమ్ లబ్దిదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఉజ్వల స్కీమ్‌లో చేరడం చాలా సులభం. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద బీపీఎల్ కుటుంబంలోని మహిళలు గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. pmujjwalayojana.com వెబ్‌సైట్ ద్వారా స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రధాని మోదీ 2016 మే 1న ఈ పథకాన్ని ప్రారంభించారు.

ప్రధాన్ మంత్రి ఉజ్వల స్కీమ్‌లో చేరేందుకు ఒక అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీన్ని తీసుకెళ్లి దగ్గరిలోని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌కి అందించాలి. అప్లికేషన్‌తోపాటు జన్ ధన్ అకౌంట్ నెంబర్, ఇంట్లో ఉన్న వారి ఆధార్ నెంబర్లు వంటివి తెలియజేయాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అర్హులైన వారికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి అనుమతినిస్తాయి. ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఒకటి ఉంటుంది. మీరు ఈఎంఐ ఎంచుకుంటే మీ గ్యాస్ సబ్సిడీ మొత్తం నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డబ్బులు కట్ చేసుకుంటాయి. సాధారణంగా గ్యాస్ కనెక్షన్‌కు రూ.3,200 అవుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1600 సబ్సిడీ అందిస్తుంది. ఇక మిగిలిన రూ.1600 ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు భరిస్తాయి. అయితే కన్సూమర్లు ఈ రూ.1600లను ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close