Top newsTrending newsViral news

గుడ్ న్యూస్.. నెలకు రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు జీవితాంతం హాయిగా ఉండొచ్చు మీకు తెలుసా

Did you know that investing Rs.1,000 per month can be comfortable for a lifetime?

మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మ్యూచువల్ ఫండ్ అందిస్తోంది. రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ పేరుతో న్యూ ఫండ్ ఆఫర్ ఓపెన్ చేసింది. 2021 ఫిబ్రవరి 3 వరకు ఇందులో చేరొచ్చు.

రిటైర్మెంట్ తర్వాతి అవసరాల కోసం ఇప్పటి నుంచే డబ్బు పొదుపుచేయాలనుకునేవారు ఈ మ్యూచువల్ ఫండ్ గురించి ఆలోచించొచ్చు. ఈక్విటీ, డెట్, గోల్డ్ లాంటి వాటిలో ఎస్‌బీఐ ఇన్వెస్ట్ చేయనుంది. ఇందులోని ఇన్వెస్ట్‌మెంట్‌ కు 5 ఏళ్లు లేదా రిటైర్మెంట్ వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.

ఎస్‌బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ ‌లో 4 రకాల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఉంటాయి. అగ్రెసివ్, అగ్రెసివ్ హైబ్రిడ్, కన్జర్వేటీవ్ హైబ్రిడ్, కన్జర్వేటీవ్ పేర్లతో ఈ ప్లాన్స్ ఉంటాయి. ఇన్వెస్టర్లు తమ రిస్కును బట్టి ఏదైనా ఓ ప్లాన్ ఎంచుకోవాలి. మరి ఏ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడులు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

ఎస్‌బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ అగ్రెసివ్ ప్లాన్ ‌లో 80 నుంచి 100 % ఈక్విటీలో పెట్టుబడులు ఉంటాయి. ఎస్‌బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ అగ్రెసివ్ హైబ్రిడ్ ప్లాన్‌ లో 65-80 % ఈక్విటీలో పెట్టుబడులు ఉంటాయి.

ఎస్‌బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ కన్జర్వేటీవ్ హైబ్రిడ్ ప్లాన్‌ లో 60-90 %డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడులు ఉంటాయి. ఎస్‌బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ కన్జర్వేటీవ్ ప్లాన్‌లో 80-100 % డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడులు ఉంటాయి.

ఈ నాలుగు ప్లాన్స్‌లో ఏది ఎంచుకున్నా 20% వరకు గోల్డ్ ఈటీఎఫ్, 10 % వరకు REITs/InVITsలో పెట్టుబడులు ఉంటాయి. ఫారిన్ సెక్యూరిటీస్, ఓవర్‌సీస్ ఈటీఎఫ్స్‌లో కూడా పెట్టుబడులు పెట్టొచ్చు. లాక్ ఇన్ పీరియడ్‌లో ఈ నాలుగు ప్లాన్స్‌లో మొదట ఎంచుకున్న ప్లాన్ నుంచి మరో ప్లాన్ ‌లోకి మారొచ్చు.

ఎస్‌బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్‌లో మొదటిసారి కనీసం రూ.5,000 ఇన్వెస్ట్ చేయాలి. సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. రోజూ, వారానికి ఓసారి, నెలకోసారి, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. డైలీ సిప్ అయితే కనీసం రూ.500, వీక్లీ సిప్, మంత్లీ సిప్ కనీసం రూ.1000, క్వార్టర్లీ సిప్ కనీసం రూ.1500, సెమీ యాన్యువల్ సిప్ కనీసం రూ.3000, యాన్యువల్ సిప్ కనీసం రూ.5000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. ఈ స్కీమ్‌లో ఎగ్జిట్ లోడ్ లేదు.

కనీసం 18 ఏళ్ల నుంచి 52 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవారు ఎవరైనా ఎస్‌బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ ‌లో చేరొచ్చు. కనీసం నెలకు రూ.1000 ఈ ఫండ్‌ లో ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ ఇన్స్యూరెన్స్ కవర్ కూడా ఉంటుంది. సిప్ టెన్యూర్ కనీసం మూడేళ్లు ఉండాలి.

మొదటి ఏడాది మంత్లీ సిప్‌ కు 20 రెట్లు, రెండో ఏడాది మంత్లి సిప్ ‌కు 50 రెట్లు, మూడో ఏడాది మంత్లి సిప్‌కు 100 రెట్లు, నాలుగో ఏడాది నుంచి మంత్లి సిప్‌ కు 100 రెట్లు ఇన్స్యూరెన్స్ కవర్ ఉంటుంది. గరిష్టంగా రూ.50 లక్షల వరకు బీమా ఉంటుంది.

ఇది న్యూ ఫండ్ ఆఫర్ కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేసేముందు ఓసారి ఫండ్ వివరాలు, ఫండ్ మేనేజర్ ఎవరు, ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది లాంటి వివరాలు తెలుసుకోవాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close