కోవిడ్-19 నుంచి రక్షించే టీ షర్ట్స్.. తొందరలో మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి
Protective T-shirts from Kovid-19 .. coming into the market in a hurry

దేశంలో కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తుంది. మహమ్మారి బారినపడి అనేక మంది ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కోలుకున్నారు. దేశంలో సంతోషించదగ్గ విషయం ఏంటంటే కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య అత్యధికంగా ఉంది. అంతేకాదు మరణాల సంఖ్య కూడా అతి తక్కువగా ఉన్నాయి. అయితే కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ తయారి చేసే పనిలో తలమునకలయ్యాయి. ఇలాంటి తరుణంలో మహమ్మారి నుంచి రక్షణ కల్పించే సరికొత్త టీషర్టులు, ఔషధ ద్రావణాన్ని మన దేశానికి చెందిన రెండు సంస్థలు అభివృద్ధి చేశాయి.
ఇ-టెక్స్, క్లెన్స్ టా అనే రెండు సంస్థలు టీషర్ట్ లు, ఔషధ ద్రావణాన్ని తయారు చేస్తున్నాయి. అంతేకాదు అతి తక్కువ ధరకే అవి అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఐఐటీ ఢిల్లీలో ఈ రెండు సంస్థలు పురుడు పోసుకున్నాయి. ఇ-టెక్స్ సంస్థ యాంటీ వైరల్ ఫ్యాబ్రిక్‌తో తాజాగా టీ-షర్టులను తయారు చేసింది. టీ షర్ట్ ధరించాక దాన్ని ఉపరితలాన్ని తాకితే కరోనా వైరస్ సహా ఏ సూక్ష్మజీవులైనాసరే ఖతం అవుతాయి. అంతేకాదు ఆ టీషర్ట్ ను 30 సార్లు ఉతికిన తర్వాత కూడా యాంటీ వైరల్ సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉండేలా రూపొందించారు.
అయితే టీ షర్ట్ పై ఉండే రసాయనాలు మనుషులకు గానీ..ప్రకృతికి గానీ ఎలాంటి హాని కలిగించవని నిపుణులు చెప్తున్నారు. ఇకపోతే క్లెన్స్ టా అనే సంస్థ ఔషధ ద్రావణాన్ని అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ ద్రావణం 99.9 శాతం వరకు సూక్ష్మక్రిములను నాశనం చేయగలదని చెప్తోంది. ఒక్కసారి ఈ ద్రావణం రాసుకుంటే 24 గంటల వరకు అది ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇ-టెక్స్ టీషర్టులు, క్లెన్స్‌టా ద్రావణంతో కూడిన కిట్‌లను ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి.రామ్‌గోపాల్ రావు శుక్రవారం ఆవిష్కరించారు. త్వరలోనే ఈ కిట్ లు తక్కువ ధరకే ప్రజలకు అందుబాటలో.