కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నాడు.. కట్ చేస్తే అద్దెంటికి షిఫ్ట్ అయ్యాడు.. ఆ హీరో ఎవరంటే

[ad_1]
సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారు కేవలం నటన మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాల్లోనూ బిజీగా ఉంటున్నారా. దాదాపు అందరు హీరోలకు, హీరోయిన్స్‌కు సపరేట్ బిజినెస్ ఉంటుంది. కొంతమంది సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తున్నారు. లేకపోతే, కొన్ని మంచి స్టార్టప్‌ను మొదలు పెట్టి వాటిలో పెట్టుబడి పెడుతున్నారు. సినీ నటులు, నటీమణులకు మరికొంతమంది రియల్ ఎస్టేట్ లోనూ రాణిస్తున్నారు. పైన కనిపిస్తున్న నటుడు కూడా అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులలో కూడా పెట్టుబడి పెట్టాడు. అందులో ఒకటి అద్దెకు ఇచ్చాడు.. ఆ ఇంటి అద్దె అక్షరాలా రూ.5 లక్షలు. ఇంతకూ ఆ హీరో ఎవరంటే..
ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే
ప్యార్ కా పంచ్ నామ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆదిలోనే సక్సెస్ కొట్టిన బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. అయితే తాజాగా ‘భూల్ భూలయ్య 2’, ‘చందు ఛాంపియన్’ సినిమాలతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. నిజానికి వ్యాపారవేత్త అయిన టాలెంటెడ్ యాక్టర్ కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. దీనికి తోడు రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెట్టాడు. కార్తీక్ ఆర్యన్ ముంబైలోని కాస్ట్లీ ఏరియా అయిన జుహులోని సిద్ది వినాయక్ ప్రెసిడెన్సీ హౌసింగ్ సొసైటీ అపార్ట్‌మెంట్‌లో అద్భుతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. ఈ ఫ్లాట్‌ను తల్లి మాలతి, కార్తీక్‌లు కలిసి కొనుగోలు చేశారు. కార్తీక్ ఈ ఏడాది ప్రారంభంలో కొనుగోలు చేసిన ఈ ప్లాట్ కోసం 17.50 కోట్ల రూపాయలు చెల్లించాడు.
ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ను చూశారా.? మెంటలెక్కించిందిగా.!
ఇప్పుడు ఈ ప్లాట్ ను నెలవారీ అద్దెపై ఇచ్చేశాడు. అద్దె దస్తావేజు నమోదు చేసి, కార్తీక్ తన ఆస్తిని నెలకు రూ.5 లక్షల చొప్పున అద్దెకు ఇచ్చాడు. గత సంవత్సరం, కార్తీక్ ఆర్యన్, తల్లి మాలతి మరో బాలీవుడ్ స్టార్ నటుడు షాహిద్ కపూర్‌కు చెందిన ఐషారామి ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. ఆ ఫ్లాట్ నెలవారీ అద్దె రూ.7.50 లక్షలు. మూడేళ్లకి లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు కూడా కార్తీక్, అతని తల్లి మాలతి అదే ఇంట్లో ఉంటున్నారు. ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ కూడా ఇదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం ‘భూల్ భూలయ్య 3’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కార్తీక్‌కు జోడీగా కియారా అద్వానీ నటించే అవకాశం ఉంది. ముందుగా కరణ్ జోహార్ నిర్మాణంలో కార్తీక్ ఆర్యన్ నటించాల్సి ఉంది. అయితే కరణ్ జోహార్ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగినందుకు కార్తీక్ ఆర్యన్‌ని తన సినిమా నుండి తొలగించాడని టాక్. ఇప్పుడు కార్తీక్ కూడా ఒకదాని తర్వాత ఒకటి హిట్ సినిమాలు చేస్తూ.. ప్రామిసింగ్ యాక్టర్ అని నిరూపించుకున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
[ad_2]