కేంద్రం లాక్ డౌన్ ని మే 3 వరకు పెంచే అవకాశం చాలా ఎక్కువ మొత్తంలో ఉంది
There is a huge amount of potential to increase the center lockdown to May 3

కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. మే 3 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. పలు రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మే 7 వరకు కూడా లాక్ డౌన్ ను విధించుకున్నాయి. అయితే నేడు ప్రధాని మోది అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. లాక్ డౌన్ విధించినా కేసులు పెరుగుతుండడం కలవరానికి గురి చేస్తుంది.
ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ కేసుల సంఖ్య 26,91 7. వీరిలో 5914 మంది డిశ్చార్ట్ కాగా 826 మంది మరణించారు. అదే విధంగా మహారాష్ట్ర ఢిల్లలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దీంతో లాక్ డౌన్ కొనసాగించాలని ఇప్పటికే మహారాష్ట ఢిల్ల సర్కార్లు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చాయి. మహారాష్ట్రలో శనివారం నాటికి 6817 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,301 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క సారిగా లాక్‌డౌన్ ఎత్తేస్తే పాజిటివ్ కేసుల సంఖ్య భారిగా పెరిగి వైద్య వ్యవస్థ పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని గుజరాత్, రాజస్తాన్, తమిళనాడుతో పాటు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లి లాక్ డౌన తప్పా మరో మార్గం లేదని అన్ని రాష్ట్రాల సీఎంలు ప్రధాని మోదీకి మరోసారి సూచించనున్నారని సమాచారం. మెజార్టీ సిఎంలు లాక్ డౌన్ కొనసాగింపుకే మొగ్గు చూపుతున్నారట. లాక్ డౌన్ ఎత్తేస్తే కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కేసుల సంఖ్యకు అనుగుణంగా వైద్యవ్యవస్టలో ప్రస్తుతం వసతులు లేవు. ద్‌ంతో పరిస్థితి దుర్చరంగా మారే అవకాశం ఉంది. అందుకే మే నెల చివరి వరకు లాక్ డౌన్ కొనసాగింపు తప్పదని సీఎంలు ప్రధానికి చెప్పనున్నారని తెలుస్తోంది.