కేంద్రం నుండి గుడ్ న్యూస్ కరొన ఎఫెక్ట్ తో మూడు నెలల పెన్షన్ ఒకేసారి బ్యాంక్ ఖాతాలో
Good news from the center is a three-month pension with a corona effect simultaneously in the bank account

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సామాన్యుడికి బ్యాంకు రుణాలు వడ్డల విషయంలో కాస్త వెసులబాటు కల్పించింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పేదలకు అండగా ఉండేందుకు ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది. లబ్దిదారులకు 3 నెలల పెన్షన్ ముందుగానే చెల్లించాలని నిర్ణయించింది. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్లమంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుంది. వైరస్‌ను అరికట్టిందుకు కేంద్రం ఏప్రిల్ 14వరకు లాక్టాన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వృద్దులు, వితంతువులు, దివ్యాంగులకు భరోసా ఇచ్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
జాతీయ సామాజిక సహకార కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 2.98 కోట్లు మంది లబ్దిదారులు పెన్షన్ అందుకుంటున్నారు. దీంతో వీరందరికి 3 నెలల పెన్షన్ మొత్తం ఎప్రిల్ నెలలోనే బ్యాంకు ఖాతాలో జమ కానుంది. ప్రస్తుతం 60 నుంచి 79 ఏళ్ల లోపున్న వృద్ధులకు రూ. 200 పింఛన్ కేంద్రం అందిసోంది. /9 ఏళ్ల లోపు దివ్యాంగులకు, వితంతువులకు రూ.300 చొప్పున పెన్షన్ ఇస్తోంది. 80 ఏళ్లు పైబడిన వృద్దులు, దివ్యాంగులకు, వితంతువులకు రూ.500 చొప్పున పెన్షన్ అందుతోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.