Trending news

కావ్య పాప ప్లేయర్ కిర్రాక్ ఇన్నింగ్స్.. కోహ్లీ దోస్త్‌కు ఇచ్చిపడేశాడుగా.. కట్‌చేస్తే.. ఫైనల్ చేరిన టీం

[ad_1]

Mayank Agarwal Fifty in Semi Final: మహారాజా టీ20 ట్రోఫీ 2024 మొదటి సెమీ-ఫైనల్‌లో, బెంగళూరు బ్లాస్టర్స్ 9 వికెట్ల తేడాతో గుల్బర్గా మిస్టిక్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. మొదటగా ఆడిన గుల్బర్గా మిస్టిక్స్ జట్టు 19.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేయగా, బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు 17.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి విజయం సాధించింది. బెంగళూరు బ్లాస్టర్స్‌కు చెందిన ఎల్‌ఆర్ చేతన్ (51 బంతుల్లో 89*) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుల్బర్గా మిస్టిక్స్‌కు కెప్టెన్ దేవదత్ పడిక్కల్‌తో కలిసి లవ్‌నీత్ సిసోడియా తుఫాన్ ఆరంభం ఇచ్చేందుకు ప్రయత్నించారు. వీరి జోడీ 2.4 ఓవర్లలో 33 పరుగులు జోడించిన తర్వాత 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పడిక్కల్ ఔటయ్యాడు. ఇక్కడి నుంచి వికెట్ల పతనం మొదలై బ్యాట్స్‌మెన్‌లు ఒకరి తర్వాత ఒకరు అవుటయ్యారు. లవనీత్ దూకుడు ఇన్నింగ్స్ ఆడి 20 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. లోయర్ ఆర్డర్‌లో ప్రవీణ్ దూబే 17 బంతుల్లో 27 పరుగులు చేయగా, రితేష్ భత్కల్ 17 పరుగులు, వాహిద్ ఫైజాన్ ఖాన్ 13 పరుగులు చేశారు. బెంగళూరు బ్లాస్టర్స్ తరపున మొహ్సిన్ ఖాన్, లావిష్ కౌశల్, క్రాంతి కుమార్, శుభాంగ్ హెగ్డే తలో రెండు వికెట్లు తీశారు.

బెంగళూరు బ్లాస్టర్స్ ఓపెనర్ల తుఫాన్ ఇన్నింగ్స్..

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు బ్లాస్టర్స్‌కు శుభారంభం లభించింది. ఓపెనింగ్ జోడీ ఎల్ఆర్ చేతన్, మయాంక్ అగర్వాల్ మొదటి నుండే దాడి చేసి పవర్ ప్లేలో 78 పరుగులు చేశారు. వీరిద్దరూ తమ భాగస్వామ్యాన్ని మరింత కొనసాగించి తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని రితేష్ భత్కల్ విడదీయగా, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 37 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అదే సమయంలో చేతన్ చివరి వరకు నాటౌట్‌గా ఉన్నాడు. భువన్ రాజు (13*)తో కలిసి 18వ ఓవర్‌లోనే తన జట్టుకు సులభమైన విజయాన్ని అందించాడు. చేతన్ 51 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 89* పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



[ad_2]

Related Articles

Back to top button
Close
Close