Trending news

కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి, ప్రాణహిత నదులు.. పుష్కరఘాట్‌ల మెట్లను..

[ad_1]

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్ళు తొక్కుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఉభయ నదులు ఉగ్రరూపం దాల్చాయి. తెలంగాణతో పాటు అటు మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదీ ప్రవాహం పుష్కరఘాట్ ల మెట్లను తాకుతూ వెళ్తోంది. త్రివేణీ సంగమం వద్ద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కర ఘాట్లను తాకుతూ 7.530 మీటర్ల మేర వరద ప్రవాహం కొనసాగుతుంది. అటు, కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజ్ కి 3,51,970క్యూసెక్కుల వరద ప్రవాహం రాగ, అంతే స్థాయిలో 85 గేట్ల ద్వారా అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close