Trending news

కార్తీక మాసం ప్రముఖ శైవక్షేత్రం.. మహానందిలో జరిగిన మహాద్భుతం… ఇదే దానికి సాక్ష్యం..!

[ad_1]

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది కోనేరులో నీటి స్వచ్చత మరోసారి రుజువైంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన గంగా హారతి సందర్భంగా ఓ భక్తుడు తీసిన వీడియో వైరల్ గా మారింది.  ఆలయం లోపల గల రుద్రగుండం కోనేరులోని నీటిలో అలయ గోపురాలు ప్రతిబింబాలు ఎంతో స్పష్టంగా కనపడ్డాయి. ఇది భక్తుల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కోనేరులో ఒక చిన్న గుండుసూది సైతం కనిపెట్టవచ్చు అని ఆలయ అధికారులు చెబుతున్నారు.

ఈ క్షేత్రంలో ఎండాకాలం అయిన వాన కాలం సీజన్‌ ఏదైనా సరే.. నీటి ప్రవాహం ఒకే విధంగా వుండటం ఇక్కడ విశేషం. అందుకే ఈ ఆలయం తీర్థ క్షేత్రం అని పిలవబడుతుంది.ఈ క్షేత్రం నీటి ప్రవాహంపై స్కందపురణంలో సైతం రాయబడింది. ఈ క్షేత్రంలోని నీరు ఐదుదారలుగా నిత్యం ప్రవహిస్తూ ఉంటుందని స్కందపురాణం,శివ పురాణంలో చెప్పినట్లు ప్రదాన అర్చకులు చెబుతున్నారు. క్షేత్రంలోని కోనేరులో స్నానం చేస్తే ఆహ్లాదంతో పాటు అనారోగ్యాలు కూడా తొలిగి పోతాయని స్దానికంగా పెద్ద ప్రచారం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

[ad_2]

Related Articles

Back to top button
Close
Close