కరోన ఎఫెక్ట్ తో పెరిగిన మొబైల్ డేటా వినియోగం అంతా ఇంతా కాదు
This is not the case with increased mobile data usage with Corona Effect

కరోనా వైరస్ ను అరికట్టిందుకు దేశమంతటా లాక్ డౌన్ ఉండడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఇంట్లొ ఖాళీగా ఉండడంతో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఆన్ లైన్ గేమ్స్ ఇతర మాధ్యమాల వాడటంపై ఫోకస్ పెట్టారు. దింతో ఇంటర్నెట్ వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వినియోగదారులు భారిగా పెరుగడంతో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది.
ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వేగంపై ఓక్లా స్పిడ్ ట్ట గ్గ్‌బల్ ఇండెక్స్ ఓ సర్వే నిర్వహించింది. దేశంలో లాక్ డౌన్ ఉన్నప్పటి నుండి బ్రాడ్ బాండ్ కంటే సెల్ ఫోన్ డేటానే అధికంగా వినియోగిస్తున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. మన దేశంలో సెల్ ఫోన్స్ వినియోగించినంతగా అమెరికాలో వినియోగించడం లేదన్నారు.అక్కడ బ్రాడ్ బాండ్ ను అధికంగా వినియోగిస్తున్నట్టు తేలింది.లాక్ డౌన్ నేపథ్యంలో ఐటీ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హొం చేయమని అనుమతిచ్చాయి. పలు కంపెనీలు వీడియో కాన్ఫరెన్స ల ద్వారా మీటింగ్ లు నిర్వహిస్తుండడం కూడా ఇంటర్నెట్ పై ప్రభావం చూపుతుంది. దింతో ఇంటర్నెట్ వినియోగం అధికమవుతుండడం వల్ల వేగం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో అధిక డేటా ప్లాన్ లకు మారుతున్నారు.
దేశంలో సుమారు 630 మిలియన్ల సెల్ ఫోన్లు, 19 మిలియన్ల బ్రాడ్ బాండ్ వినియోగదారులున్నారు. స్మార్ట్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరూ కనీస ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉన్నారు. కాగా, గత వారం వైనా, జపాన్ దేశాల్లో బ్రాడ్ బాండ్ కనెక్షన్ల డౌన్ లోడ్ వేగం పెరిగిందని. మలేషియాలో తగ్గిందని ఓక్లా సర్వేలో తేలింది. మొబైల్ డౌన్ లోడ్ వేగం జపాన్ లో సాపేక్షంగా ఉందని.. భారత్ లో ఇది కాస్త పడిపోయిందని తెలిపింది. గత వారంతో పోలిస్తే దేశంలో ఇంటర్నెట్ మడ 4.9 శాతం తగిందని పేరొ ది.