కరోనా కు 10 కోట్ల మంది బలి అయ్యే అవకాశం ఉంది?
10 crore people could be killed for corona?

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బీవిస్తున్న ఈ తరుణంలో ప్రముఖ జర్నల్ లాన్సెట్ మరింత భయపెట్టే వాదనను తెరపైకి తెచ్చింది. 1918 లో వచ్చిన HINI ఇన్ ఫ్లు ఎంజా లాగానే కరోనా వ్యాప్తి
భయంకరంగా ఉంటుందని ఆ పత్రికలో ప్రచురించిన ఒక పరిశోధన అభిప్రాయపడింది. HINI ఇన్ ఫ్లు ఎంజాతో ప్రపంచంలో దాదాపు 10 మిలియన్ల మంది చనిపోయారు. సీజనల్ ఇన్ ఫ్లు ఎంజా కేసులో -మరణాల నిష్పత్తి (సీఎఫ్‌ఆర్) సుమారు 0.1 శాతం ఉండగా, వైనాలో కరోనా కేసు-మరణాల నిష్పత్తి అంచనా వేసినట్లు చైనా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ గావో ఫూ నేతృత్వంలోని పరిశోధనా పత్రం స్పష్టం చేసింది. కరోనా కేసుల పెరుగుదల ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది మరణాల సంఖ్యను పెంచుతుందని
పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. ఈ అంచనా ప్రకారం దాదాపు పది కోట్ల మంది కరోనాకు బలయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
చైనా మొత్తం వ్యాపించే ప్రమాదం. కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్సిషన్ మూలం ఇప్పటివరకు తేలలేదని పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. చైనాలోని దాదాపు మొత్తం జనాభా కరోనా బారిన పడే ప్రమాదం ఉందని గురయ్యే అవకాశం ఉందని పరిశోధన పత్రం పేర్కొంది.వైనాలో కరోనా వైరస్ మహమ్మారి రెండవ సారి వ్యాప్తిని ఎదుర్కొంటుందని అధ్యయనం అంచానా వేస్తోంది. ఆ ప్రభుత్వం అమలు చేసిన వ్యూహాలువిజయవంతం అయినప్పటికీ, అంటువ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో వైరస్ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.