కరోనా ఎఫెక్టుతో ప్రపంచ దేశాలు భారతీయ సాంప్రదాయానికి జైజైలు పలుకుతున్నారు
With the corona effect, the countries of the world are giving jaiseh to the Indian tradition

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. లక్షలాది మందికి ఈ వైరస్ సోకగా, వేలాది మంది మృత్యువాత పడ్డారు. అమెరికా, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ప్రజలు ఒకరినొకరు తాకకుండా సామాజిక దూరం పాటిస్తున్నారు. దింతో కొన్ని సాంప్రదాయాల్లి మార్పులు వస్తున్నాయి.
భారత్ లో మొదటినుండి ఒకరికొకరు విష్ చేసుకోవడానికి నమస్కారం అలవాటుగా ఉంది. కొన్నేళ్లుగా మనం పాశ్చాత్య సాంప్రదాయానికి అలవాటుపడి షెక్ హ్యాండ్ ఇస్తున్నాము. కొన్ని సందర్భాల్స్ కౌగిలించుకుంటున్నాము. కానీ, కరోనా వల్ల తిరిగి మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేస్తున్నాము.
ఆస్టేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్ల్ మగవారు షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేయడం, ఆడవారు చెంపల మీద ముద్దు పెట్టుకోవడం ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా యూరప్, ఉత్తర అమెరికా ఖండాల్తొని దేశాల్ల్ ఒకరినొకరు
కౌగిలించుకొని విష్ చేయడం వాడుకలో ఉంది. నేపాల్, టర్కి లాంటి దేశాల్లో స్కౌట్స్ తో విష్ చేసుకునే అలవాటు ఉంది. కానీ ప్రస్తుతం కరోనా దెబ్బకు అందరూ భారతీయ సాంప్రదాయానికి జై కొడుతున్నారు. పరస్పరం నమస్కరించుకుంటూ విష్ చేసుకుంటున్నారు. కరోనాతో విష్ చేసుకునే సాంప్రదాయంలో కూడా మార్పు వచ్చిందని ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.