ఐడియా వోడాఫోన్ జియో కస్టమర్లకు గుడ్ న్యూస్ వెంటనే తెలుసుకోండి
Good news for Idea Vodafone Jio customers
మీరు వొడాఫోన్ కస్టమరా? అయితే మీకు శుభవార్త. వొడాఫోన్ ఐడియా తాజాగా తన సబ్‌స్క్రైబర్లకు తీపికబురు అందించింది. ప్రిపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీని పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఫీచర్ ఫోన్ ఉపయోగిస్తున్న అల్పాదాయ కస్టమర్లకు మాత్రమే ఈ బెనిఫిట్ లభిస్తుంది. ఖచర్ ఫోన్ ఉపయోగిస్తున్న అల్పాదాయ కస్టమర్లకు ప్రిపెయిడ్ రీచార్ట్ వ్యాలిడిటిని పొడిగిస్తున్నామని వోడాఫోన్ ఐడియా తెలిపింది. ఏప్రిల్ 17 వరకు ఈ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొంది. దీంతో రీచార్ట్ ప్లాన్ వ్యాలిడిటీ అయిపోయినా కూడా కస్టమర్లకు ఇన్‌కమింగ్ కాల్స్ పొందొచ్చు. సాధారణంగా ప్లాన్ వ్యాలిడిటీ అయిపోతే ఇన్‌కమింగ్ కాల్స్ రావు.
అంతేకాకుండా వొడాఫోన ఐడియా మరో ఆఫర్ కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. వీరికి రూ.1 0 ఉచిత టాక్‌టైమ్ ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ పరిస్థితుల్లో కస్టమర్లకు ఈ ఉచిత టాక్ టైమ్ అందిస్తున్నామని, వారు వారి కుటుంబ సభ్యులతో అనుసంధానమై ఉండొచ్చని కంపెనీ వివరించింది. కాగా వొడాఫోన్ ఐడియా దారిలోనే ఎయిర్‌టెల్ కూడా నడిచింది. ఎయిర్టెల్ కూడా తన కస్టమర్లకు ఇలాంటి బెనిఫిట్స్‌నే అందించింది. 8 కోట్ల మంది సబ్‌స్కైబర్లకు ప్రయోజనం కలుగుతుందని ఎయిర్‌టెల్ తెలిపింది. అలాగే ప్రభుత్వ రంగ టెలికం కంపెనీలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్ కూడా ఇలాంటి ఆఫర్లనే అందించాయి. ఏప్రిల్ 20 వరకు వాలిడిటీని పొడిగించాయి. రూ.10 ఉచిత టాక్‌టైము ఆఫర్ చేస్తున్నాయి. జియో కూడా ఇదే బాట పట్టుంది.